Differences between TDP and YSRCP Plenaries

Bhumana clarity on ysrcp plenary

YSRCP, YSRCP Plenary, YSRCP Pleanry 2017, Bhumana Karunakar Reddy, Bhumana on Plenary, Bhumana Karunakar Pleanry, TDP Mahanadu YCP Plenary, TDP YSRCP Plenaries Difference, Mahanadu Food Plenary

Bhumana karunakar Reddy about YSRCP Plenary. Compared with TDP Mahanadu only food Plenary, YSRCP's People Plenary.

టీడీపీ, వైసీపీ ప్లీనరీకి తేడా ఏంటి?

Posted: 07/08/2017 12:41 PM IST
Bhumana clarity on ysrcp plenary

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్పీసీ ప్లీనరీ మొదలైపోయింది. దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులర్పించి మరీ జగన్ అమరావతికి బయలుదేరాడు. గుంటూరు-విజయవాడ హైవేపై నాగార్జున యూనివర్శిటీ ఎదుట ఉన్న మైదానంలో వైసీపీ ప్లీనరీ జరుగుతోంది. ఈ ప్లీనరీకి ఏర్పాట్లు భారీగా చేశారు. ప్లీనరీలోని వేదికను జర్మనీ టెక్నాలజీతో నిర్మించటం విశేషం.

కేవలం అధికార దాహంతోనే అమలు కానీ లక్ష్యాలను చేయలేని హామీలను ఇచ్చి టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ నేత భూమాన కరుణాకర్ రెడ్డి విమర్శించాడు. ఆ పార్టీని ఎండగడుతూ, ప్రజల పక్షాన తమ వైసీపీ పోరాడుతోందన్నాడు. ప్రజల సంక్షేమం కోసం వైసీపీ ఎంత నిబద్ధతతో ఉందో, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ పార్టీ ఎంత కృత నిశ్చయంతో ఉందో ప్లీనరీలో చెబుతామని అన్నారు. టీడీపీది వంటావార్పుల ప్లీనరీ అయితే, తమది మాత్రం ప్రజల ఆశయసాధనకు కృషి చేసే ప్లీనరీ అని చెప్పారు.

Bhumana on Plenary

ప్లీనరీలో 18 కీలక అంశాలపై చర్చించనున్నట్లు, రాబోయే రెండేళ్లలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తామని వెల్లడించాడు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని అన్నారు. వీటన్నింటిపై గత మూడేళ్లుగా తమ పార్టీ పోరాటం చేస్తోందని, దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని తెలిపాడు. మరోవైపు వచ్చే ఏడాది మొదటి నుంచి జగన్ నిరవధిక పాదయాత్రకు సిద్ధమైపోతున్నాడని సమాచారం అందుతోంది. 8 నెలలు రాష్ట్రం మొత్తం పర్యటించి ప్రజలకు చేరువవ్వాలనే ఆలోచనలో ఉన్నాడంట. ఈ మేరకు ప్లీనరీలో తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు టాక్.

ప్లీనరీ స్పెషాలిటీస్...

వేదిక ఎదుట పదివేల మందికి పైగా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. నేతలకు, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వర్షం పడినా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.

ప్లీనరీకి తరలి వస్తున్న నేతలు, కార్యకర్తలను ఆకట్టుకునేలా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు, పల్నాటి బ్రహ్మనాయుడు, వంగవీటి మోహనరంగా, కూచిపూడి నృత్యకారులతో పాటు పలువురు నేతల పేర్లతో స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు.

వేదిక వద్ద వైయస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు విగ్రహాన్ని ఉంచారు. అంతే కాకుండా వేదిక ముందు అనేక వైయస్ విగ్రహాలను ఉంచారు. జగన్ కు స్వాగతం పలుకుతూ పలు ఫ్లెక్సీలను కట్టారు.

నాయకులకు, కార్యకర్తలకు వేర్వేరుగా భోజన వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నేతలతో కలసి కూర్చొని జగన్ భోజనం చేసేలా ఏర్పాట్లు జరిగాయి. మొత్తం 30 వేల మంది వస్తారని భావిస్తుండగా, సుమారు 5 వేల మంది ఒకేసారి భోజనం చేసేలా ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP Plenary  Bhumana  TDP Mahanadu  

Other Articles