drunk conistable hulchul in mamunuru police station limits కాకీ పిల్ల కాకికి ముద్దు అంటే ఇదేనోమో..?!

Drunk conistable hulchul in mamunuru police station limits

TSSP conistable manhandles women, tssp conistable abuses women, tssp conistable huchul, TSSP conistable, mamunuru police station, abuse, manhandles, fir, lenin nagar, telangana, crime

A TSSP conistable creates ruckus in mamunuru police station limits in inebriated condition, not only abusing women but also manhandles women passes by.

కాకీ పిల్ల కాకికి ముద్దు అంటే ఇదేనోమో..?!

Posted: 07/08/2017 12:53 PM IST
Drunk conistable hulchul in mamunuru police station limits

కాకి పిల్ల కాకి ముద్దు అన్న సామెతను విన్నారుగా.. సరిగ్గా అలాంటి చర్యలకే పాల్పడుతున్నారు మమునూరు పోలిసులు. తమ గూటికి చెందిన పక్షిని రక్షించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. టీఎస్ఎస్ఫీకి చెందిన నేతలు కూడా రంగంలోకి దిగి.. తమ పక్షిని రక్షించే పనిలో పడ్డారు. ఇంకేముందు విషయం బయటపడటంతో విమర్శలను ఎదుర్కొంటున్నారు. వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై నాయుడు పెట్రోల్‌ బంకు వద్ద క్రితం రోజు రాత్రి ఓ టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్ మద్యం మత్తులో నానా రభస చేశాడు. మ్యాటర్ లోకి ఎంటరైతే..

జాతీయ రహదారిపై నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ బారులోకి వెళ్లి ఫుల్లుగా మద్యం కోట్టాడు. బార్ నుంచి బయటకు రాగానే దారిన పోయే మహిళలు, ప్రయాణికులను దుర్భాషలాడుతూ హంగామా క్రియేట్ చేశాడు. ఆర్టీఏ జంక్షన్‌ సమీపంలోని లెనిన్ నగర్ కాలనీలోని బంధువుల ఇంటికి వెళ్తున్న మరో ఇద్దరు మహిళలను ఆడ్డగించి అసబ్యపదజాలంతో తిట్లపురాణాన్ని అందుకున్నాడు. బిత్తెరపోయిన మహిళలు అసలు నువ్వు ఎవరు..? మమల్ని ఎందుకు తిడుతున్నావు అని వారు ప్రశ్నించడంతో.. వారిపై అకారణంగా చేయికూడా చేసుకున్నాడు.

కానిస్టేబుల్ అకారణంగా తమపై చేయిచేసుకోవడంతో మహిళలు తమ బంధువలకు విషయాన్ని ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో మహిళల బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుని కానిస్టేబుల్ ను నిలదీశారు. అతడిపై  మామునూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసి మరీ పోలీసులకు అప్పగించగించారు. అయినా అతడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సమాచారం అందుకున్న టీఎస్‌ఎస్పీ పోలీసు సంఘం నేతలు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కానిస్టేబుల్‌పై కేసు నమోదు కాకుండా ప్రయత్నాలు చేశారు. ఈ విషయమై ఎస్సై యుగేందర్‌ను వివరణ కోరగా..  అసలు ఈ విషయం తన దృష్టికి రాలేదని, బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSSP conistable  mamunuru police station  abuse  manhandles  fir  lenin nagar  telangana  crime  

Other Articles