CBI Raids on Ex CM House Case Filed

It raids on lalu s house

Lalu Prasad Yadav, Lalu House, Lalu CBI Raids, Lalu Prasad Yadav Case, CBI Lalu Case, CBI raids Bihar Ex CM, CBI Raids EX CM, Lalu And Family Case Filed, Lalu Family Hotel Corruption, Lalu Prasad Yadav Corruption

CBI raids Bihar Ex CM, RJD Chief Lalu Yadav's home, files case against him, family over alleged irregularities in lease of hotels. In 2006 Tenders Golmaal.

ఫ్లాష్: లాలూ ఇంటిపై దాడులు

Posted: 07/07/2017 08:43 AM IST
It raids on lalu s house

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు మరో షాక్ తగిలింది. ఆయన నివాసంపై ఈ ఉదయం సీబీఐ ఆకస్మిక దాడులు చేసింది. గత కొంతకాలంగా ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు ఓ రేంజ్ లోనే వినిపిస్తున్నాయి. దీనికి తోడు కేంద్రంపై ఆయన స్వరం పెంచి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఈ నేపథ్యంలో లాలూ నివాసంపై సీబీఐ అధికారులు చేయటం విశేషం. ఇంటితోపాటు ఆయనకు చెందిన 12 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. హోటళ్ల వ్యాపారంకు సంబంధించి అవకతవకలు బయటపడ్డాయని తెలుస్తోంది. 2006 లో అక్రమ టెండర్లకు పాల్పడ్డారని లాలూ కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా లాలూ, అతని భార్య రబ్రీదేవి, అతని కుమారుడిపై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు.

మరోపక్క లాలూ కూతురు ఆస్తులపై కూడా ఆ మధ్య సీబీ‘ఐ’వేసిన విషయం తెలిసిందే. ఆయన కుమారులు, మంత్రులు అయిన తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ లు పెట్రోల్ బంకుల పేరుతో బినామీ వ్యాపారాలు నడుపుతున్నారని బీహార్ బీజేపీ అధ్యక్షుడు సుశీల్ మోదీ సాక్ష్యాలతోసహా మీడియా ముందుకు వచ్చాడు కూడా.

సాక్ష్యాలున్నాయ్...

లాలూ ప్రసాద్ యాదవ్ అవకతవకలకు పాల్పడ్డ మాట వాస్తవమని, అందుకు తమ వద్ద సాక్ష్యాలున్నాయని సీబీఐ ప్రకటించింది. లాలూ ఇల్లు సహా, ఆయన కుటుంబీకులకు చెందిన ప్రాంతాల్లో దాడులపై సీబీఐ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చుకుంది. పలు ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగా లాలూ వ్యవహరించారని, హోటళ్ల టెండర్లలో అక్రమాలు చేశారని సీబీఐ డిప్యూటీ డైరెక్ట‌ర్ రాకేష్ ఆస్తానా తెలిపాడు.

ఓ సంస్థకు రెండు హోటళ్లను ఇచ్చినందుకు ప్రతిగా విలువైన భూమిని లంచంగా తీసుకున్నారని ఆయన తెలిపారు. మరిన్ని సోదాలు చేయాల్సి ఉందని వెల్లడించిన ఆయన, 2006లో లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలోనే అధికారం అండతో ఈ అవకతవకలు చేశారన్నాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Lalu Prasad Yadav  CBI Raids  

Other Articles