Lorry crushes three to death in Hyderabad అతివేగం.. నెత్తురోడిన రహదారి..

Lorry crushes three to death in hyderabad

Lorry crushes three to death in Hyderabad, Hyderabad lorry accident, Balkampet temple, Kukatpally, road mishap in kukatpally, telangana, crime

A speeding lorry crushed to death three of a family heading to Balkampet temple on a two-wheeler in Kukatpally on Sunday.

అతివేగం.. నెత్తురోడిన రహదారి.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Posted: 07/02/2017 11:59 AM IST
Lorry crushes three to death in hyderabad

దైవదర్శనానికని వెళ్లిన ఆ కుటుంబాన్ని వెనకగా వచ్చిన మృత్యుశకటం కబళించడంతో పెను విషాదం నిండింది. బోనాల సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్న కుటుంబ సభ్యులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్ కూకట్ పల్లి జాతీయ రహదారి రక్తమోడింది. వెనుకగా వేగంగా దూసుకెళ్లిన లారీ ముందువెళ్తున్న స్కూటీ సహా బైక్ ను ఢీకొట్టనడంతో ప్రమాధం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, కూతురు అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనానికని బయలుదేరిన అమీన్ పూర్ మండలానికి  చెందిన నర్సింహులు, లలిత దంపతులతో పాటు తొమ్మిదో తరగతి చదువుతున్న కూతురు శిరీష ముగ్గురూ కలిసి ఒకే ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. బల్కంపేటలో నర్సింహులు కుమారుడు చదువుతున్నాడు. అంతా కలిసి అమ్మవారి దర్శనం చేసుకోవాలని అనుకున్నారు. ద్విచక్రవాహనం కూకట్ పల్లి వివేకానంద నగర్ వద్దకు రాగానే మృత్యురూపంలో అతివేగంగా వచ్చిన సిమెంటు లారీ వీరిని ఢీకొట్టింది.

మృతులపై నుంచి లారీ వెళ్లడంతో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురిని ఢీకొన్న తర్వాత లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పటికీ 10 మీటర్ల వరకు వెళ్లిన తరువాత కానీ లారీ అగలేందంటూ దాని వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. లారీ సడన్ బ్రేకు వేయడం దాని వెనకనున్న మరో ద్విచక్ర వాహనదారుడు మత్స్యగిరి లారీని ఢీకొని గాయపడ్డాడు. ఘటనాస్థలానికి చురుకున్న పోలీసులు మృతదేహాలను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. మత్స్యగిరిని అస్పత్రికి తరలించారు. ప్రమాద ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Three dead  lorry accident  Balkampet temple  Kukatpally  telangana  crime  

Other Articles