minister calls for reservations for SC, ST in Indian cricket team ఈ కేంద్రమంత్రే కొత్త రిజర్వేషన్ వింటే విస్తుపోతారు..!

Ramdas athawale calls for reservations for sc st in indian cricket team

Union minister of state for social justice, Ramdas Athawale demanded reservations for the SC-ST community in the Indian cricket team.

Union minister of state for social justice, Ramdas Athawale demanded reservations for the SC-ST community in the Indian cricket team.

ఈ కేంద్రమంత్రే కొత్త రిజర్వేషన్ వింటే విస్తుపోతారు..!

Posted: 07/02/2017 11:22 AM IST
Ramdas athawale calls for reservations for sc st in indian cricket team

రాజకీయ నేతల పార్టీలు పెట్టడం, వినూత్న డిమాండ్లను సాధిస్తామని చెప్పడం సాధారణమే. అందులోనూ ఎన్నికల సమయంలో ఈ డిమాండ్లకు అది అంతూ వుండదు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్ తీసుకోస్తామన్న డిమాండ్ కూడా వస్తుందని ఇప్పటికే ప్రముఖ భారత రచయితలు తమ కథలలో వ్యక్తపర్చిన విషయం తెలిసిందే. అలాంటి కొత్త వాదననే తెరపైకి తీసుకువచ్చారు మరో నాయకుడు. నాయకుడంటే మామూలు నేత కాదు ఏకంగా బీజేపి కేంద్రమంత్రి రాందాస్.

బీజేపికి చెందిన కేంద్ర మంత్రి కాబట్టి ఏదో ఒక వివాదాస్పద అంశంపై  కోత్త రిజ్వేజన్ వాదనను అందుకున్నారని భావించడం సహజమే. కానీ ఈయన ఏకంగా టిమీండియా క్రికెట్ లోనే రిజర్వేషన్ దళితులకు రిజర్వేషన్ కల్పించాలని  వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన క్రీడాకారులకు రిజర్వేషన్‌ కల్పించాలని సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్‌ అభిప్రాయపడ్డారు. కనీసం 25 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే ఆయా వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరినట్లవుతుందని వాదనను ఆయన తెరపైకి తీసుకువచ్చారు.  

అంతటితో అగని కేంద్రమంత్రి ఏకంగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ పైనల్స్‌లో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఫిక్సైందన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో(జూన్‌ 18న) జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో టీమిండియా ఘోరపరాజయంపాలైన తీరు తనను విస్మయానికి గురిచేసిందని, దీనిపై సమగ్రదర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రాందాస్‌ అథావాలే అరోపిస్తున్నారు.

వడోదరలో పర్యటించినా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బలమైన టీమిండియా జట్టు ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ తొలి మ్యాచులో చిరాకాల ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్‌ను 180 పరుగుల తేడాతో చిత్తుచేసిందని అయితే.. ఫైనల్స్ లో మాత్రం భారత్ 124 పరుగుల తేడాతో ఓడిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని తనకే కాదు యావత్ దేశ క్రికెట్ అభిమానులకు ఈ అనుమానం కలుగుతుందని ఆయన అరోపించారు. అసలు ఇదెలా జరిగింది? మ్యాచ్‌ ఫిక్సైందా? దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలు వెలికితీయాలి’ అని రాందాస్‌ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  pakistan  ind vs pak  Ramdas Athawale  reservation  SC  ST  Indian cricket team  BCCI  cricket  

Other Articles