blood donation in shirdi sansthan gives vip status షిరిడీలో వీఐపి దర్శనం చాలా ఈజీ..

Blood donation in shirdi sansthan gives vip status for year

shridi sansthan vip status to devotees, shridi sansthan blood donation, shridi sansthan trust chairman suresh hare, shridi sai, shridi sansthan, blood donation, vip status, vip darshan, vip room booking, sansthan hospitals

shiridi sansthan gives devotees vip status for an year for darshan and room booking, who donates blood in sansthan hospitals.

షిరిడీలో వీఐపి దర్శనం చాలా ఈజీ..

Posted: 06/22/2017 01:19 PM IST
Blood donation in shirdi sansthan gives vip status for year

మానవసేవే మాధవ సేవ అన్న నానుడిని ప్రసిద్ది షిరీడీ సంస్థాన్ ట్రస్టు ఫాలో అవుతుంది. షరిడీ సాయినాధుడు చెప్పిన సూక్తులకు అనుగూణంగా తమ కార్యచరణను అమలుచేస్తుంది. షిరిడీలో విఐపీ అనే మాటకు కొంతకాలం వరకు దూరంగా వున్న ట్రస్టు.. వీఐపి, వీవిఐపీ దర్శనాలను, హరతి టిక్కెట్లను విక్రయించి తిరుమల తిరుపతి దేవస్థానం మార్గాన్ని ఫాలో అయ్యింది. అదేమార్గంలో భక్తులకు క్యాంటిన్లు, ఉచిత బోజనం, బస్సు రవాణా లాంటి సదుపాయాలను కూడా కల్పించింది. ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న నేపథ్యంలో షిరిడి సంస్థాన్ ఒక్కసారిగా సాయినాథుడి సూక్తులు గుర్తుకువచ్చినట్లు వున్నాయి.

దీంతో అటు సాధారణ వీఐపీ టిక్కెట్లతో పాటు మరో కొత్త తరహా విఐపీ ట్రీట్ మెంట్ కు కూడా సంస్థాన్ నిర్వాహకులు అందుబాటులోకి తీసుకువచ్చారు. అవునండీ ఈ వీఐపీ కోటా అందరికీ మాత్రం కాదండీ.. సాయినాథుడి సూక్తులను అచరించే భక్తులకు మాత్రమే. దీంతో మీకు కూడా ఏం చక్కా వీఐపీలాగే షిర్డీ సాయినాధున్ని దర్శించుకునే అవకాశాన్ని షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ కల్పిస్తోంది. ఇంతకీ సాయినాథుడి సూక్తులేంటీ అనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నాం. మీరు చేయాల్సిందల్లా షిరిడీ సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిభిరంలో రక్తధానం చేయడమే.

షిర్డీ సాయినాధుని దర్శనానికి వెళ్లిన భక్తులు రక్తదానం చేయడం ద్వారా ఒక ఏడాది పాటు ఆలయంలో వీఐపీ హోదాలో దర్శనం ఉండటంతోపాటు సత్రాల్లో బస విషయంలో కూడా వీఐపీ తరహాలోనే సంస్థాన్ ఏర్పాటు చేస్తుంది. సర్వ మానవ శ్రేయస్సు కోసం ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ట్రస్టు చైర్మన్‌ సురేశ్‌ హారే మీడియాకు తెలిపారు. షిర్డీని బ్లడ్‌ బ్యాంక్‌ హబ్‌గా మార్చడం తమ ఉద్దేశమని చెప్పారు. ‘తిరుమల తిరుపతిలో తలనీలాలు సమర్పించినట్లే. షిర్డీకి వచ్చినవారు రక్తదానం చేయడం ఆనవాయితీగా మారుస్తాం’  అని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles