jeevitha rajashekar relative arrested again జీవిత బంధువు అరెస్టు..

Actress jeevitha relative arrested while changing demonetised notes

jeevitha relative srinivas arrested, drugs case accused srinivas rao, actress jeevitha, jeevitha rajashekar, changing of demonetised notes, srinivasa rao, demonetisation, old currency, arrest, crime

Srinivasa Rao, relative of tollywood actress Jeevita was arrested again while trying to change the demonetised currency of Rs 7 crores, who earlier arrested in drugs case.

సినీనటి జీవిత సమీప బంధువు మళ్లీ అరెస్టు..

Posted: 06/22/2017 01:21 PM IST
Actress jeevitha relative arrested while changing demonetised notes

సినీనటి, ప్రస్తుత సెన్సార్ బోర్డు సభ్యురాలు జీవితా రాజశేఖర్ సమీప బంధువు శ్రీనివాస్ రావును మళ్లి హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో శ్రీనివాసరావును అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో గతంలో అరెస్టయిన శ్రీనివాసరావు.. ఆ తరువాత బెయిల్ పోంది బయటకు వచ్చారు. అయినా తాజాగా ఆయన రద్దైన పాత నోట్లు అక్రమంగా రవాణా చేసి మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాస్ రావు వద్ద నుంచి సుమారు 7 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శివసేన వినతి మేరకు కదిలిన కేంద్ర ప్రభుత్వం.. పాత నోట్లను మార్చుకునేందుకు మరో నెల రోజుల వ్యవధిని ఇచ్చిన విషయం తెలిసిందే. పోస్టాఫీసులు, డీసీసీబీలలోని పాత నోట్లు డిపాజిట్ కు భారతీయ రిజర్వు బ్యాంకు అనుమతినివ్వడంతో.. ఇన్నీ రోజులు రద్దు చేసిన పాత నోట్లను సేకరించే పనిలో వున్న శ్రీనివాసరావు.. వాటిని మార్చకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఏకంగా సుమారు 7 కోట్ల రూపాయల మొత్తంలో పాత నోట్ల మార్పిడి చేసేందుక ప్రయత్నిస్తున్నాడన్న సమాచారం అందుకున్న టాస్క్ పోర్స్ పోలీసులు అతని కార్యాలయంపై దాడి చేసి అతనితో పాటు వున్న ఇద్దరిని, డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ మొత్తం జూబ్లీహిల్స్ లోని జీవితా రాజశేఖర్ కు చెందిన కార్యాలయంలోనే లభ్యం కావడంతో.. ఈ అక్రమ నోట్ల మార్పడి ఘటనలో అమె ప్రమేయం కూడా వుందా..? అన్న అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో స్పందించిన జీవిత, అసలు శ్రీనివాసరెడ్డి తన బంధువే(సోదరుడని కొందరు ప్రచురించారు) బంధువే కాదని చెప్పుకొచ్చింది. తన కార్యాలయంలో అసలు శ్రీనివాస్ కు సంబంధించి ఆఫీస్ లేదని, తన నలుగురు మేనేజర్ లో అతను ఒకడని క్లారిటీ ఇచ్చింది. అనవసరంగా తన పేరును వార్తల్లో తెచ్చారంటూ వాపోయింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress jeevitha  srinivasa rao  demonetisation  old currency  arrest  crime  

Other Articles