ISIS Destroys Al Nuri Mosque, Another Loss for Mosul జీహాద్ కోసమంటూ చారిత్రక మసీదును కూల్చారు..!

Isis blows up historic al nuri mosque in mosul where baghdadi became caliph

Islamic State, Mosque, Mosul, Abu Bakr al-Baghdadi, Al-Hadba, Baghdadi, Haider al-Abadi, Al-Nuri Mosque, Nuri Mosque, Ramadan, Ramzan, ISIS, Caliph, United States, US, Iraq, The Great Mosque, Grand Al-Nuri

Jihadists blew up Mosul’s iconic leaning minaret and the adjacent mosque where their leader Abu Bakr al-Baghdadi in 2014 declared himself “caliph” in his only public appearance, Iraqi officials said.

జీహాద్ కోసమంటూ చారిత్రక మసీదును కూల్చారు..!

Posted: 06/22/2017 12:26 PM IST
Isis blows up historic al nuri mosque in mosul where baghdadi became caliph

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రపంచం నలుమూలల వున్న ముస్లిం యువతను అల్లా కోసం చేస్తున్న పోరాటం అని చెబుతూ.. వారిలో భావోద్వేగం పెంపోందించే ప్రసంగాలను వినిపిస్తూ.. ఇక అల్లా కోసం ఎంతవరకైనా సిద్దం.. చివరకు ప్రాణాలు పోయినా ఫర్వాలేదన్న స్థాయికి వారిని తీసుకెళ్లి.. వారిని అత్మహుతి దాడులుగా మార్చివేస్తూ.. కన్నవారి అశలను, ఆశయాలను అడియాశలు చేస్తున్నారు. అయితే వారు చెబుతున్న దాంట్లో నిజమేమైనా వుందా..? ఇది నిజంగా వారు అల్లా కోసం చేస్తున్న యుద్దమా.. ఇది జీహాదేనా..? అంటే ఐసిస్ ప్రసంగాలతో ప్రేరేపితమవుతున్న యువత అలోచించాల్సిన అవసరముంది.

మరో వారం రోజుల వ్యవధిలో రంజాన్ పర్వపండగను జరుపుకోనున్న సమయంలో చారిత్రాత్మక అల్లా ప్రార్థానా మందిరాలను కూల్చివేస్తున్న తరుణంలో అల్లా కోసం జీహాద్.. అంటూ నినదిస్తున్న ఐసిస్ లో నిజమెంతా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం యువతపై వుంది. ఇరాక్‌లోని మొసూల్‌ నగరంలో గల అతి పురాతన చారిత్రక కట్టడం అల్‌ నూరీ మసీదును ఐసీస్ ఉగ్రవాదులు పేల్చివేసి ఉగ్రవాదానికి మతం, కులం, ప్రాంతం అన్న తేడాలు లేవని మరోమారు నిరూపించిన నేపథ్యంలో అటుగా అకర్షితులవుతున్న యువత పునరాలోచన చేయాల్సిన అవసరాన్ని కల్పించింది.

మొసూల్‌ నగరాన్ని అధీనంలోకి తెచ్చుకునేందుకు గతకొన్ని నెలలుగా ఇస్లామిక్‌ ఉగ్రవాదులు, ఇరాక్‌ భద్రతా బలగాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐసిస్‌ ఉగ్రవాదులు మసీదును పేల్చివేశారు. అయితే మసీదును తాము పేల్చలేదని ఇస్లామిక్‌ స్టేట్‌ పేర్కొంది. అమెరికా సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లోనే అల్‌ నూరీ మసీదు ధ్వంసమైందని ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన అమఖ్‌ న్యూస్‌ ఏజెన్సీ ప్రకటించింది. కాగా.. ఐసిస్‌ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన అమెరికా.. అల్‌ నూరీ మసీదు ధ్వంసమైందన్న వార్త నిజమేనని అయితే సంకీర్ణ దళాల వైమానిక దాడుల వల్ల మాత్రం కాదని అసలు తాము ఆ ప్రాంతంలో దాడులు చేయలేదని వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mosul (Iraq)  Mosques  Al-Nuri Mosque  Ramadan  Islamic State in Iraq and Syria (ISIS)  

Other Articles