A Hindu Can Never Be A Terrorist says Minister Anil Vij బీజేపి మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కౌంటర్

A hindu can never be a terrorist says haryana minister anil vij

Hindu cannot be a terrorist, Anil Vij, terrorism, hindu terrorism, chidambaram, digvijay singh, congress, 2007 Samjhauta Express, train blast, haryana

A Hindu can never be a terrorist and there cannot be any term like "Hindu terrorism", senior Haryana minister Anil Vij said

బీజేపి మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కౌంటర్

Posted: 06/21/2017 06:48 PM IST
A hindu can never be a terrorist says haryana minister anil vij

బీజేపీకి చెందిన హర్యానా మంత్రి అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి కులం, మతం, ప్రాంతమన్న విభేదాలు లేవని ఇన్నాళ్లు ప్రచారం చేసిన నేతలు.. తాజాగా మతాలను వర్గీకరిస్తూ ఉగ్రవాదంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అవి కాస్తా వివాదాస్పదమయ్యాయి. దేశంలో ఇప్పటివరకు జరిగిన ఉగ్రదాడుల్లో దోషులంతా ముస్లింలేనని, హిందూ  ఉగ్రవాదమన్నది కేవలం మిథ్య అని వ్యాఖ్యానించారు. హిందువుగా పుట్టినవాడు ఉగ్రవాది కాబోడని కూడా అన్నారు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఉగ్రవాదం విషయంలో కాంగ్రెస్‌ పార్టీది ద్వంద్వ వైఖరిని తప్పబట్టారు. కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్) హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని సృష్టించిందని అన్నారు. నిజానికి ఏ హిందువు ఉగ్రవాది కాడు.. కాబోడు. దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు జరిగిన దాడుల్లో దోషులు, నిందితులు అందరూ ముస్లింలే కదా?’ అని అనిల్ విజ్ అన్నారు.

ఇండియాపై దాడులు చేసిన ఎంతోమంది టెర్రరిస్టులను కాంగ్రెస్ హయాంలో విడిచిపెట్టారని, ఇప్పుడు వాళ్లంతా సమన్లను సైతం లెక్కచేయకుండా పాకిస్థాన్లో ఎంజాయ్ చేస్తున్నారని అనిల్ విజ్ మండిపడ్డారు. హిందూ ఉగ్రవాదం అన్నది నిజంగా ఉన్న పక్షంలో దేశం ఎప్పుడో నాశనమైయ్యేదని  అన్నారు. కాగా మంత్రి అనిల్‌ విజ్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఘాటుగా సమాధానమిచ్చారు.

సంఘ్ పరివార్ ఉగ్రవాద సంస్థే అన్న నిజాన్ని అనిల్ తన వ్యాఖ్యల ద్వారా మరోసారి నిరూపించారని దిగ్విజయ్ అన్నారు. ‘పరివార్ ఉగ్రవాద సంస్థని అనిల్‌ విజ్ అధికారికంగా ప్రకటించుకున్నారని అన్నారు. కాంగ్రెస్ చెబుతున్నది కూడా అదేనన్నారు. హిందువులు ఉగ్రవాదులు కారు.. సంఘ్‌ శక్తులు మాత్రమే టెర్రరిస్టులని దిగ్విజయ్‌ వ్యాఖ్యానించారు. కాగా హర్యానా మంత్రి అనీల్ విజ్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anil Vij  terrorism  hindu terrorism  chidambaram  digvijay singh  congress  haryana  

Other Articles