Karnataka waives crop loan up to Rs 50,000 per farmer సర్కార్ కీలక నిర్ణయం.. రుణాలు మాఫీ చేసిన సీఎం

Siddaramaiah waives off rs8 165 crore farm loans in karnataka

Siddaramaiah, Karnataka, Farmers crisis, farmers, farm loan waiver, co-operative banks, Rs 50,000 loans, loan waiver, karnataka, farm loans, farm loan waiver, Siddaramaiah, Punjab, Uttar Pradesh, politics

The Karnataka government announced crop loan waiver of up to Rs 50,000 per farmer that will cost Rs 8,165 crore to the state exchequer.

సర్కార్ కీలక నిర్ణయం.. రుణాలు మాఫీ చేసిన సీఎం

Posted: 06/21/2017 05:55 PM IST
Siddaramaiah waives off rs8 165 crore farm loans in karnataka

అధికార సిద్ది కోసం రామయ్య రుణ పాచిక వేశారని ప్రతిపక్షాలు గల్లుమంటున్నా.. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు ఉపశమనం పోందుతున్నారన్నదే తనకు ముఖ్యమని.. ఆ తరువాత తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి. గత నాలుగేళ్లుగా రైతులు అనేక కష్టాలు పడుతున్నా పట్టించుకోని సర్కారు ఒక్కసారిగా ఎన్నికల మంుదు రుణాలను మాఫీ చేసినంత మాత్రాన లభ్ది ఎలా చేకూరుతుందన్నది విపక్షాల ప్రశ్న.

తన హాయంలోని కాంగ్రెస్ పార్టీని మరోమారు కార్ణటకలో అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇలాంటి పాచిక వేసి ఓటర్లను తమ పార్టీ వైపు అకర్షించారన్న విపక్షాలు విమర్శించినా.. వాటిని పట్టించుకోకుండా కర్ణాటక ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇలాంటి సాహపోపేత నిర్ణయాలను తీసుకోగలదని మరోమారు నిరూపించామని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. పదమూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏకంగా దేశవ్యాప్త రైతుల కన్నీళ్లను రుణమాఫీతో తూడ్చిందని అ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇంతకీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యా ఎన్ని రుణాలను.. ఎందరి రుణాలను రద్దు చేశారో తెలుసా..? కో-ఆపరేటివ్ బ్యాంకుల నుంచి రూ.50వేల లోపు రుణాలను పోందిన రైతు రుణాలను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయంతో రూ.8,167 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ఖజానాపై పడినా.. అన్నదాతల సంక్షేమమే తమ అభిమతమని చెప్పుకోచ్చింది. రైతు ఆత్మహత్యలను నివారించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఆయా వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddaramaiah  farmers  loan waiver  loans  karnataka  politics  

Other Articles