Tv actress blackmailed, molested in ananthapur టీవీ నటి బ్యాక్ మెయిల్, నిర్భంధం.. అత్యాచారం

Tv actress blackmailed molested in ananthapur

telugu tv actress raped, rape on tv artist, telugu tv actress blackmailed, telugu tv actress nude photos, telugu tv actress nude videos, rape on telugu tv actress, rachakonda police commissionarate, girish, ananthapur, tv artist, tv actress, crime

telugu upcomming Tv actress blackmailed and raped in ananthapur, who escaped and filed complaint against girish at rachakonda police commissionerate

టీవీ నటి బ్లాక్ మెయిల్, నిర్భంధం.. అత్యాచారం

Posted: 06/21/2017 09:03 PM IST
Tv actress blackmailed molested in ananthapur

బ్యుటీషియన్‌ శిరీష ఆత్మహత్య ఘటనలో ఇంకా అనుమానాలున్నాయని వారి బంధువులు అరోపిస్తున్న తరుణంలోనే మరో టీవీ నటిని ఓ కామాంధుడు నిర్భంధించి అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని నివాసముంటూ టీవీ సీరియల్స్ లో ఆర్టిస్టుగా రాణిస్తోన్న ఓ నటిని అనంతపురానికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కామాందుడి చెర నుంచి చాకచక్యంగా తప్పించుకుని హైదరాబాద్ కు వచ్చిన నటి రాచకొండ పోలీస్ కమిషర్ మహేష్ భగవత్ కు రాత్రి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అనంతపురానికి చెందిన నిందితుడ్ని అరెస్టు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లో నివసించే టీవీ ఆర్టిస్టును.. అదే ప్రాంతంలో ఉంటోన్న అనంతపురం వాసి గిరీశ్ రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశాడు. తన మాట వినకుంటే ఆ అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి అమెను లొంగదీసుకుని అనంతపురానికి తీసుకెళ్లాడు. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లిన నిందితుడి ఆమెను నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఎలాగోలా ఆ కీచకుడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు హైదరాబాద్‌ చేరుకుని.. నిందితుడి గురించి.. వాడు జరిపిన అఘాయిత్యం గురించి నేరుగా రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఆదేశంతో రంగంలోకి దిగిన ఎల్బీ నగర్‌ పోలీసులు.. అనంతపురానికి చేరకుని నిందితుడు గిరీశ్ ను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  blackmail  rachakonda police commissionarate  girish  ananthapur  tv artist  tv actress  crime  

Other Articles