Minister Jawahar demand apology from YS Jagan and Sakshi

Minister jawahar fire on jagan

AP Minister Jawahar, Minister Jawahar, Sakshi Jagan Legal troubles, AP Government Sakshi, AP Minister Apology Jagan, Minister Asked Jagan Apology, AP Bars Renewal Scam, Andhra Pradesh Bar Tenders

AP Excise Minister Demand Apology from YS Jagan for Corruption Allegations. In Sakshi they published ManduChoopu indirectly mentioned minister name on process of Bars Renewal.

సాక్షి పై కేసు.. జగన్ బహిష్కరణ...

Posted: 06/20/2017 09:30 AM IST
Minister jawahar fire on jagan

తన పత్రిక సాక్షిగా అధికార పక్షం టీడీపీ, దాని అధినేత చంద్రబాబు నాయుడు అండ్ కోను ఏకేయటంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ముందుంటాడు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి ఆరోపణలు శృతి మించుతాయనే విశ్లేషకులు తరచూ చెబుతుంటారు. తాజాగా అలాంటి అతితోనే మరోసారి వార్తల్లో నిలిచింది.

ఏపీలో జూలై 1న బార్ల రెన్యువల్ టెండర్ల ప్రక్రియ కొనసాగబోతుంది. ఈ వ్యవహారంలో కోట్లలో అవినీతి జరిగిందంటూ మందుచూపు పేరిట ఓ కథనంను ప్రచురించింది. అందులో ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ వందల కోట్లు దండుకున్నాడంటూ రాసింది. దీంతో రంగంలోకి దిగిన మంత్రి దానిపై మండిపడ్డారు. సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా ధరల నిర్థారణ, టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని వివరణ ఇచ్చుకున్నాడు. కానీ, బార్ల రెన్యువల్ ప్రక్రియ కోసం 40 లక్షల చొప్పున లంచం తీసుకుని అవకతవకలకు పాల్పడాడంటూ జగన్ మానసపుత్రిక ఆ కథనంలో పేర్కొంది.

మొత్తం 332 కోట్లతో బార్ లు ఐదేళ్లకు రెన్యువల్ ప్రక్రియ, మరో 85 కొత్త వాటికి అనుమతులు ఇవ్వడం అంటూ అందులో ఉంది. దీంతో తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే కనుక తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఆరోపణలు నిరూపించలేని పక్షంలో జగన్ రాష్ట్రం విడిచి పోవాలని మంత్రి జవహార్ డిమాండ్ చేశాడు. జగన్, సాక్షి పత్రిక ఇరవై నాలుగు గంటల్లోగా తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నాడు. లేని పక్షంలో న్యాయపరంగా ఎదుర్కొవాలంటూ సవాల్ విసిరాడు. ఈ మధ్యే జరిగిన కేబినెట్ విస్తరణ ఆయనకు మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Andhra Pradesh  Minister Jawahar  Mandu Choopu  Bar Renewal Scam  

Other Articles