Ruckus in JC Diwakar Reddy Barred from Airlines

Another mp banned by airlines

JC Diwakar Reddy, TDP MP Airlines, JC Diwakar Reddy Ban, Airlines Ban MP, Airlines MP Ban List, Another MP Airlines Ban, TDP MP Vixag Airport, Vishakapatnam Airport TDP MP, Vishakapatnam Airport JC Diwakar Reddy, MP JC Ban Airlines, Vishakapatnam Airport JC Diwakar Reddy, Anantapur MP Rucks, JC Diwakar Reddy Attack Airport Staff

TDP MP JC Diwakar Reddy creates ruckus at Vizag airport; banned by IndiGo, others. But, Anantapur MP says he not create any problem and damage at Airport.

ఎయిర్ పోర్ట్ రచ్చ.. ఎంపీపై బ్యాన్

Posted: 06/16/2017 08:15 AM IST
Another mp banned by airlines

టీడీపీ సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. సిబ్బంది పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్ లైన్స్ సంస్థలు ఆయన పై బ్యాన్ విధించాయి.

ముందుగా ఇండిగో ఎయిర్ లైన్స్ ఆ తర్వాత ఎయిరిండియా, స్పైస్‌ జెట్, జెట్‌ ఎయిర్‌ వేస్‌ సంస్ధలు కూడా జేసీపై నిషేధం విధించాయి. బోర్డింగ్ పాస్ ఇవ్వటానికి ఆలస్యం అయ్యిందన్న కారణంగా ఆయన ఆ ప్రింటర్ ను ఎత్తిపడేసే ప్రయత్నం చేశారని సిబ్బంది వివరించారు. తమ స్టాఫ్ తో దురుసుగా ప్రవర్తించినందుకు జేసీని తమ విమానాల్లో ప్రయాణానికి అనుమతించబోమని ఆయా ఎయిర్‌లైన్స్‌లు ప్రకటించింది.

ఇంతకు ముందు శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ గతంలో ఎయిరిండియా సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించి నిషేధానికి గురైన విషయం తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత ఎయిరిండియా ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసింది. మరి జేసీ సంగతి ఏమవుతుందో చూడాలి!

నేనేం గొడవ చేయలేదు: జేసీ

తాను ఎటువంటి విధ్వంసం సృష్టించలేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాకు స్పష్టం చేశారు. సమయమున్నా బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని, ఎయిర్ పోర్టు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఎయిర్ పోర్టు సిబ్బంది తీరుతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఫిర్యాదు చేశానని, ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని జేసీ పేర్కొన్నారు.

హైదారాబాద్ కు వచ్చే క్రమంలో వైజాగ్ విమానాశ్ర‌యంకు వెళ్లిన ఆయన, తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వ‌నందుకు ‘ఇండిగో’ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. బోర్డింగ్ పాస్ ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. అయినప్పటికీ, సిబ్బంది అంగీకరించకపోవడంతో అక్క‌డి ఫ‌ర్నిచ‌ర్‌ను జేసీ ధ్వంసం చేశారు. జేసీ దివాక‌ర్ రెడ్డి ఆల‌స్యంగా రావ‌డంతోనే ఆయ‌నకు బోర్డింగ్ పాస్ ఇవ్వ‌లేద‌ని ‘ఇండిగో’ సిబ్బంది చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JC Diwakar Reddy  Vishakapatnam Airport  Airlines Ban  

Other Articles