Corruption Charges Shia, Sunni Waqf Boards Dissolve in UP

Up announces dissolution of shia sunni waqf boards

Yogi Adityanath, Yogi Adityanath Shia, Sunni Waqf Boards, Shia, Sunni Waqf Boards UP, Uttar Pradesh Azam Khan, SP Leader Corruption, Yogi Adithyanath CBI Azam Khan, Azam Khan Waqf Boards Scam, Waqf Boards Yogi Adityanath, Waqf Boards Dissolution, Waqf Property Scam, Yogi Adithyanath Shocking Decision, Yogi Adithyanath Controversy

Yogi Adityanath Government Announces Dissolution Of Shia, Sunni Waqf Boards. UP govt wants CBI to probe Waqf property 'scam', 'misuse of office' by Azam Khan

సీఎం నిర్ణయం వివాదాస్పదం

Posted: 06/16/2017 08:54 AM IST
Up announces dissolution of shia sunni waqf boards

మరో సంచలన నిర్ణయానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వేదిక కాబోతుంది. ముస్లింల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న షియా, సున్ని వక్ఫ్ బోర్డులు రద్దు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున్న ఆయా సంఘాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

అసలు విషయం ఏంటంటే... షియా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు వసీం రిజ్వీ, సమాజ్‌ వాదీ పార్టీ ప్రభుత్వంలో వక్ఫ్ మంత్రిగా వ్యవహరించిన అజాం ఖాన్‌ అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(సీడబ్యూసీ) విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే యోగి సున్నీ, షియా వక్ఫ్ బోర్డు రద్దు చేయాలంటూ వక్ఫ్ మంత్రి మొషిన్ రాజాను ఆదేశించారు. అంతేకాదు ఎస్పీ సీనియర్ నేతపై సీబీఐ విచారణకు కూడా ఆదేశించబోతున్నట్లు సమాచారం.

చట్టపరమైన అన్ని విషయాలు పరిశీలించిన అనంతరమే వక్ఫ్ బోర్డుల రద్దు నిర్ణయం తీసుకున్నామని, ఇతర విషయాలపై న్యాయ, చట్టపరమైన అంశాలపై అధ్యయనం జరుగుతున్నట్టు తెలుస్తోంది. షియా బోర్డులోఅజాంఖాన్ మరియు సున్ని బోర్డులో ఆయన భార్య ఇద్దరూ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, కావాలనే బోర్డులను రద్దు చేస్తున్నారంటూ కొందరు మత పెద్దలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వక్ఫ్ బోర్డు ల స్థానంలో కొత్త బోర్డును గానీ, లేక ఓ ప్రత్యేక అధికారినిగానీ నియమించే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yogi Adityanath  Uttar Pradesh  Waqf Boards Dissolve  

Other Articles