Central Employees Sacked if Submit Fake Certificates

Central government solid warn to employees

Central Government, Employees Fake Certificates, Central Government Employees, Central Government Employees Sack, SC BC Fake Certificates, Fake Certificate Scam

Employees who got jobs using forged scheduled or backward caste certificates will be dismissed, the Centre has said. The move assumes significance as over 1,800 appointments, a majority of them in financial sectors like public sector banks and insurance companies, were allegedly secured through fake caste certificates, official data reveals.

సెంట్రల్ ఉద్యోగులకు సాలిడ్ వార్నింగ్

Posted: 06/15/2017 06:36 PM IST
Central government solid warn to employees

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. షెడ్యూల్డ్ తరగతులు(SC, ST), వెనుకబడిన వర్గాల(BC)వారిమంటూ నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదిస్తే వారికి ఉద్వాసన తప్పదని తెలిపింది. అంతేకాదు ఇప్పుడున్న కేంద్ర ఉద్యోగుల పూర్తి వివరాలు, వారి విద్యార్హత పత్రాలు సరైనవోకాదో తెలియజేయాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

వారిని కేంద్ర ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. నకిలీ సర్టిఫికెట్లని తేలితే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. సుమారు 1,800 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్టు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన కేంద్రం దిద్దు బాటు చర్యలు చేపట్టింది. వీరిలో ఎక్కువ మంది బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లోనే ఉండటం గమనార్హం.

ఉద్యోగంలో చేరే సమయంలో నిబంధనల ప్రకారం తప్పుడు పత్రాలను సమర్పిస్తే వారిని ఉద్యోగంలోంచి తొలగించే అధికారం ఉంది అని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ శాఖ తెలిపింది. ఈ విషయమై కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ స్పందిస్తూ1832 మంది ఇలా తప్పుడు మార్గాల్లో ఉద్యోగం సంపాదించినట్లు మార్చి 29న లోక్ భకు ఓ నివేదిక సమర్ఫించినట్లు తెలిపాడు.

వారిలో 276 మంది ని సస్పెండ్ చేయగా, 521 మంది పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, మిగతా 1,035 కేసుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందంటూ వివరించాడు. ఎస్ బీఐ లో 157, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 135, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 112, సిండికేట్ బ్యాంకులో 103, న్యూ ఇండియా ఎస్సురెన్స్ అండ్ యూనైటెడ్ ఇండియా ఎస్సురెన్స్ లో 41 మందిని ఉన్నట్లు
సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Central Government  Employees  Fake Certificate Scam  

Other Articles