Brave housecat challenges LION పిల్లికి చెలగాటం.. మరి సింహానికి..?!

Trying to be su purr ior house cat challenges a lion in texas

bigcatderek, big cat derek, big cat rescue, care rescue texas, house cat Baggy, center for animal research and education, texas, lion housecat, housemeow, cat, lion, cat lion fight, cat challenges lion, texas, animals, viral video, video viral

Texas house cat Baggy squared up to giant lion Noey as their owner watched on in hysterics. The black an white feline can be seen running up to the large wild cat.

ITEMVIDEOS: ఏయ్ నువ్వు బిగ్ క్యాట్ అయితే.. సవాలు విసిరిన క్యాట్..

Posted: 06/15/2017 03:40 PM IST
Trying to be su purr ior house cat challenges a lion in texas

ఏయ్ నువ్వు బిగ్ క్యాట్ అయితే నాకేంటి.. నేను క్యాట్ నేనన్న విషయాన్ని మర్చిపోయావా..? అంటూ ఏకంగా సింహం వద్దకు వెళ్లిన పిల్లి తన సవాలు చేసింది. అదేనండీ సవాలు విసిరేలా సింహాంపైకి ఏకంగా రంకెలేసినంత పనిచేసింది. అడవిలోని వన్యప్రాణులే మృగరాజును చూసిచూడగానే తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తే.. ఇంట్లో పెంపుడు పిల్లి మాత్రం సింహంపైకి తోడగోట్టి సవాల్ చేసింది. సింహంపైకి దూసుకెళ్లినంత పనిచేసింది. ఒక్కసారి కాదు పదే పదే పలుమారు ఇలా చేసిన పిల్లి ఒక దశలో మృగరాజునే కంగారు పెట్టించింది.

ఇక మ్యాటర్ లోకి ఎంటరైతే.. అమెరికాలోని టెక్సాస్ లో ఓ అమెరికన్ జంట తమ ఇంట ముద్దుగా పెంచుకుంటున్న పిల్లికి బ్యాగీ అని నామకరణం కూడా చేశారు. టెక్సాస్ లోని వన్యమృగాల ప్రదర్శన శాలకు తీసుకువెళ్లాడు. అక్కడి వెళ్లగానే తమ పిల్లి ఎలా ప్రవర్తిస్తుందో చూడాలనుకున్నాడు. తన పిల్లిని కంగారు పడవద్దని చెబుతూ.. దానిని వీపును నిరిమి కిందకు వదిలాడు. అంతే ఏకంగా నూయీ అనే సింహం వున్న కేజీ వద్దకు వెళ్లిన బ్యాగీ దానిని చూసి ఏమాత్రం కంగారు పడకుండా ఏయ్ నువ్వు బిగ్ క్యాట్ అయితే నేను క్యాట్ నేనన్న విషయాన్ని మరవద్దు అన్నట్లు చెలరేగింది.

సింహం తనకు కేటియించిన కేజీలో వుండటంతో పిల్లి అటలు సాగాయి కానీ.. లేకుంటేనా అన్న వారు కూడా లేకపోలేదు. అయితే పిల్లి సింహాని చూసి కూడా ధైర్యంగా దానిపైకి దూసుకెళ్లడం మాత్రం అభినందించక తప్పదన్న వారు బ్రేవ్ బ్యాగీ, శభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు. అయితే ఈ మొత్తం సంఘటనను బ్యాగీ యజమాని తన వీడియోలో రికార్డు చేయడం, దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో దానిని నెట్ జనలు విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. దీంతో ఈ విడియో కాస్తా వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cat  lion  cat lion fight  cat challenges lion  texas  animals  viral video  video viral  

Other Articles