Bride Gang Raped Before wedding in West Godavari

Bride gang rape in andhra pradesh

Bride Gang Rape, Andhra Pradesh Bride Gang Rape, Gang Rape New Bride, Gang Rape Before Wed, Bride Gang Rape West Godavari, Andhra Pradesh Crime News, Before Wed Bride Rape

Bride Gang Rape before wedding in Andhra Pradesh West Godavari. When She go toilet outside youth dragged her and Raped.

పెళ్లి కూతురు లేచిపోయిందనుకుంటే...

Posted: 05/30/2017 09:46 AM IST
Bride gang rape in andhra pradesh

మరికొద్ది గంటల్లో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంది. కుటుంబమంతా పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉంది. వరుడి తరపు బంధువులంతా పెళ్లి మంటపానికి చేరుకుని ముస్తాబైపోతున్నారు. ఇంతలో పెళ్లి కూతురు కనిపించటం లేదన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రేమించిన వాడితో వెళ్లిపోయిందా? అంటూ గుసగుసలాడుకున్నారు కొందరు. బంధువులంతా బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ లలో వెతకసాగారు. అలా సాయంత్రం అయ్యే సరికి పిడుగులాంటి వార్త వారిని తాకింది.

ఊరి అవతల చెట్ల పొదల్లో అత్యాచారానికి గురై అపాస్మారక స్థితిలో పడి ఉందా యువతి. వెస్ట్ గోదావరి నిడదవోలులో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్లితే ముప్పవరం గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతికి అదే గ్రామానికి చెందిన యువకుడితో సోమవారం ఉదయం వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఆదివారం రాత్రి ఆమె బహిర్భూమి కోసం ఊరి బయటకు వెళ్లింది.

ఇదే అదనుగా భావించిన ఓ యువకుడు కొందరు స్నేహితుల సాయంతో ఆమె నోరు మూసి, దగ్గర్లోని చెరుకుతోటలోకి బలవంతంగా తీసుకెళ్లి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
యువతి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కలసి గాలింపు చేపట్టారు. చివరకు సోమవారం సాయంత్రం గ్రామానికి దగ్గర్లోని చెరకు తోటలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వధువును పశువుల కాపరులు గుర్తించి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. 108 వాహనంలో నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్నారు. మల్లిపూడి సత్యనారాయణ అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు యువతి పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Bride  Gang Rape  

Other Articles