CM Yogi Serious on Woman Minister Inaugurates Beer Bar

Yogi s minister inaugurates beer shop stirs row

UP Minister Swati Singh, Minister Open Bar, Woman Minister Beer Bar, Minister IPS Beer bar Open, Yogi Adityanath Swathi Singh, Beef Ban Bar Open, Lady Minister bar Opening Photos, Minister Ribbon Cut Bar, Yogi Adithyanath Bar Liquor Prohibition

Uttar Pradesh Minister Swati Singh Inaugurates Beer Bar in Lucknow, pictures go viral. Yogi Adityanath seeks explanation from Minister and IPS officer.

బీఫ్ బ్యాన్.. బీర్ కు మాత్రం పర్మిషన్

Posted: 05/30/2017 11:07 AM IST
Yogi s minister inaugurates beer shop stirs row

యోగి సర్కార్ క్లీన్ యూ సర్టిఫికెట్ కోసం పరితపిస్తున్న వేళ మహిళా మంత్రి చేసిన పని తీవ్ర చర్చకు దారితీసింది. ఓ బార్ ను ఓపెన్ చేస్తూ నవ్వుతూ ఫోజులిచ్చిన ఫోటోలు వార్తల్లో వైరల్ అవుతున్నాయి. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్వాతి సింగ్‌ "బీ ద బీర్‌' అనే లగ్జరీ బార్‌ లక్నోలో ప్రారంభించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.

బీజేపీ 'బీఫ్‌ ను బ్యాన్‌ చేసి, బీర్‌ ను పొంగిస్తోంది' అంటూ పలువురు ఎద్దేవా చేస్తుండగా, 'ముఖ్యమంత్రేమో మద్యం నిషేధిస్తానంటాడు, మంత్రులేమో మద్యం దుకాణాలకు క్యూకడుతున్నారు' అంటూ మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు. ఇంకో నెటిజన్ మరింత ముందుకెళ్లి 'ముసుగు తొలగిస్తే కనబడే బీజేపీ అసలు ముఖం ఇదే' అంటూ వ్యాఖ్యానించాడు. బీజేపీ అభిమాని 'స్వాతి మేడమ్‌ ఏమిటీ పని' అంటూ ఆమెను ప్రశ్నించాడు. ఇలా యూపీలో ముఖ్యమంత్రి, మంత్రులపై నెటిజన్లు విమర్శలు సంధిస్తున్నారు.

కాగా, కేంద్రం బీఫ్ పై బ్యాన్ విధించిన అనంతరం మణిపూర్ లో బీజేపీ నేత ఒకరు తక్కువ ధరకే బీఫ్ ను అందజేస్తానంటూ ప్రకటించి కలకలం రేపారు. దానిపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. బీజేపీ తీరుపై ధ్వజమెత్తుతున్నారు. స్వాతి భర్త బీఎస్పీ చీఫ్ మాయవతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండ్ కు గురికాగా, ఇప్పుడు మంత్రి పదవిలో ఉండి ఇలాంటి పని చేస్తుందా? అంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఘటనపై సీఎం యోగి కూడా నివేదిక కోరినట్లు సమాచారం. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Minister Swathi Singh  Bar Opening  

Other Articles