Trump Seeks To Convert Grant To Pakistan Into Loan

Trump seeks grant to pak convert into loan

Donald Trump, Donald Trump Pakistan Grant, Donald Trump First Budget, US Military Grant, Pakistan Grant To Loan, Donald Trump Insult Paikstan, US Grant Countries, Pakistan Financial Aid Effect, US budget 2017, America Financial Shock to Pakistan

Pakistan may get Shock from Donald Trump. US President Donald Trump has proposed conversion of American military grant to Pakistan into loan, Mr Trump has left it to the US State Department to take a final call.

పాక్ ట్రంప్ రుణం తీర్చుకుంటుందా?

Posted: 05/24/2017 09:38 AM IST
Trump seeks grant to pak convert into loan

పైకి నవాజ్ షరీఫ్ ను కలవటం అదృష్టమని చెబుతూనే భారత్ ను ఉగ్రవాద బాధిత దేశంగా పేర్కొంటూ పాక్ కు గట్టి దెబ్బే వేశాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆపై సౌదీ సదస్సులో తమకు ప్రసగించే అవకాశం కూడా ఇవ్వకపోటం పాక్ మీడియా అవమానం మీద అవమానం జరిగిందంటూ కథనాలతో తెగ బాధపడుతోంది. ఇదిలా ఉంటే దాయాది దేశానికి ట్రంప్ నుంచి మరో ఊహించని షాకే తగిలింది. ఆ దేశానికి ఇచ్చిన ఆర్థిక సాయాన్ని అప్పుగా మారుస్తూ కొత్త తీర్మానం చేసేదిశగా అడుగులు వేస్తుండటంతో కలవరపాటు మొదలైంది.

బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉగ్రవాదంపై పోరాటానికి పాకిస్థాన్ కు భారీ ఎత్తున నిధులు ఇచ్చింది అమెరికా. ఆ సహాయాన్ని ఇప్పుడు రుణంగా మార్చేయమని అధికారులను ఆదేశించాడు. తన హయాంలో ప్రవేశ పెట్టనున్న మొట్టమొదటి బడ్జెట్‌ కి తగిన మార్పులు చేయాలంటూ చేసిన సిఫారసుల్లో దీని కూడా పేర్కొన్నాడు. మరికొన్ని దేశాలకు చేసిన ఆర్థిక సాయాన్ని లోన్ గా మార్చేయాలని స్పష్టమైన ఆదేశాలు అందినట్లు బడ్జెట్ మేనేజ్‌ మెంట్ డైరెక్టర్ మైక్ ముల్వానీ తెలిపాడు.

నిజానికి ఎన్నికల ప్రచార సమయంలోనే విదేశీ రుణాలు, ఆర్థిక సాయంపై ట్రంప్ మండిపడ్డాడు. తాను అధికారంలోకి వస్తే అలాంటి వాటికి అడ్డుకట్ట వేస్తానని పేర్కొన్నాడు కూడా. ట్రంప్ నిర్ణయం అమలైతే గనుక ఆ రూట్ లో చైనా కూడా ప్రయాణించే అవకాశం ఉందని కొన్ని దేశాలు కంగారు పడుతున్నాయి. అయితే భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో లక్షల కోట్ల ఉచిత పెట్టుబడులు పేరిట చైనా చేస్తున్న దౌత్య రాజకీయాలకు చెక్ పడే అవకాశం ఉంటుంది. ట్రంప్ జాబితా నుంచి ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలకు మినహాయింపు ఇవ్వగా, పూర్తి జాబితాను త్వరలో విడుదల చేస్తారంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Pakistan  US Military Grant  

Other Articles