OPS Tweet On Alliance With BJP Kicks Up Storm In Tamil Nadu తొందరపడి ముందే కూసిన పన్నీరు.. తాకిన విమర్శకుల సెగ

Ops tweet on alliance with bjp kicks up storm in tamil nadu

O Panneerselvam camp,Puratchi Thalaivi,Tamil Nadu civic polls,RK Nagar bypoll, tweet, BJP, alliance, local elections

A tweet by O Panneerselvam, leader of the Puratchi Thalaivi (Amma) faction of AIADMK, on a possible alliance with BJP after the declaration of civic polls kicked up a storm

తొందరపడి ముందే కూసిన పన్నీరు.. తాకిన విమర్శకుల సెగ

Posted: 05/21/2017 02:31 PM IST
Ops tweet on alliance with bjp kicks up storm in tamil nadu

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పురచ్చి తలైవీ(అమ్మ) అ‍న్నాడీఎంకే పార్టీ అధినేత పన్నీర్ సెల్వానికి అదివారం విమర్శల సెగ తాకింది. ఇన్నాళ్లు అయన చెబుతున్న అమ్మ ఆత్మ కథలను తమిళ ప్రజలు తీవ్రంగా విమర్శించారు. అమ్మ నమ్మినబంటుగా వుంటున్న పన్నీరు అమ్మకు పూర్తిగా భిన్నమైన చర్యలకు పాల్పడుతున్నాడంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా విమర్శలు జడివాన కురిసింది. దీంతో తాను చేసిన ట్విట్ ను వెంటనే తొలగించి ఆ తరువాత దానిని సవరిస్తూ మరో ట్విట్ చేయాల్సి వచ్చింది పన్నీరుకు.

ఇంతకీ పన్నీరు సెల్వం ఏమని ట్విట్ చేశారు..? అందెందుకు కలకలం సృష్టించింది..? అంటే తాను ఇకపై రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని ట్వీట్ చేసి ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించి అనంతరం ఆ ట్వీట్ ను తొలగించారు. ఏ పార్టీతో పొత్తు ఉంటుందనేది తర్వాత చెప్తామంటూ సవరణ చేసి మరో ట్వీట్‌లో స్పష్టతనిచ్చారు. ‘స్థానిక ఎన్నికల షెడ్యూలు వచ్చిన తర్వాత మేం బీజేపీతో పొత్తు విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం’ అని పన్నీర్‌ సెల్వం తరుపున ట్వీట్లు చేసే ఆయన కార్యాలయం ఒక ట్వీట్‌ చేసింది.

ఈ ట్వీట్ బయటకు రాగానే తమిళనాడులో విస్తృత చర్చ మొదలైంది. అసలు ఏం జరుగుతోందంటూ తమిళనాడులో ప్రతి ఒక్కరు స్పందించడం మొదలుపెట్టారు. ఒక రకంగా సెల్వానికి వ్యతిరేకంగానే ప్రతిస్పందనలు వచ్చాయి. ఇన్నాల్లు పన్నీరు చెప్పింది నమ్మిన ఆయన కార్యకర్తలు విపక్షాలు అరోపిస్తున్నట్లుగా ఆయన వెనకాల కేంద్రం అండదండలు వుండటం వల్లనే ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేశారని, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి కూడా పన్నీరే కారణమన్న టాక్ మొదలైంది. దీంతో అప్రమత్తమైన ఆయన టీం వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించి పరిస్థితులకు తగినట్లుగా స్థానిక ఎన్నికల తేదీలు విడుదల చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని, అది ఏ పార్టీతో ఉంటుందనే విషయం స్పష్టం చేయలేమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : panneerselvam  puratchi thalaivi aiadmk  tweet  BJP  alliance  local elections  

Other Articles