CM hails woman attacker, who bobbitised godman కీచకుడికి తగిన శాస్తి చేశావ్ శబాష తల్లి.. సీఎం ప్రశంస

Cm hails woman attacker who bobbitised godman

Hari Swami, Bobbitised godman arrested, CM hails attacker, CM hails woman attacker, Hindu ashram, Panmana Ashram, Thiruvananthapuram Medical College Hospital, Kollam, Kerala Chief Minister, CM Pinarayi Vijayan, india news, latest news

A godman bobbitised by a young woman he had been allegedly raping for years remained in a hospital even as police formally arrested him.

కీచకుడికి తగిన శాస్తి చేశావ్ శబాష తల్లి.. సీఎం ప్రశంస

Posted: 05/21/2017 12:34 PM IST
Cm hails woman attacker who bobbitised godman

ఆధ్యాత్మిక పూజలు నిర్వహిస్తానని గత ఎనిమిదేళ్లుగా వారింట్లోకి ప్రవేశించి యువతిపై కన్నేసి అమెపై లైంగికదాడికి పాల్పడిన హరి స్వామికి పురుషాంగాన్ని బాధితురాలు కోసి వేసిన ఘటన కేరళలో చోటుచేసుకుని యావత్ దేశంలో సంచలనానికి తెరతీసింది. ఈ క్రమంలో అత్యాచారం చేసినప్పుడు గుర్తుకురాని పరువు మర్యాదు ఒక్కసారిగా గుర్తుకు వచ్చిన స్వామీజి.. అది తనకు పనికిరాదని తానే కోసేసుకున్నానని అబద్దాలు చెప్పి చికిత్స చేయించుకోగా, ఆ యువతి మాత్రం నేరుగా పోలీసులకు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలిపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ యువతి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అధ్యాత్మికత ముసుగు ధరించి.. మేక వన్నె పులుల్లా సంచరిస్తున్నవారితో జాగ్రత్తగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మత గురువుల వేషం వేసుకుని గత ఎనిమిదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న మృగాడికి తగిన శాస్తి చేసిందని ఆయన అభినందించారు. ఆ యువతి తనకు ఎదురవుతున్న కష్టాన్ని ఎంతో ధైర్యంగా అధిగమించిందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hari Swami  bobbitised  godsman  kerala cm  pinarayi vijayan  panmana ashram  kollam  

Other Articles