Trunp Little Bit time to React North Korea air strike

N korean missile can reach us in 39 minutes

Donald Trump, North Korea Air Strike, 30 to 39 minutes, Donald Trump Short Time, Donald Trump North Korea Attack, North Korea Air Strikes, America North Korea War, North Korea To America Missiles, US 39 minutes, Kim Jong-un, Kim Jong-un Donald Trump

Donald Trump would have just 10 minutes to decide what to do if North Korea fired a nuclear missile at the US mainland. A deadly missile could also reach Washington, DC in as little as 30 to 39 minutes.

జస్ట్ 39 నిమిషాల్లో మొత్తం సర్వనాశనం?

Posted: 05/18/2017 08:21 AM IST
N korean missile can reach us in 39 minutes

ఉత్తర కొరియా వర్సెస్ అమెరికా పంచాయితీ రెచ్చగొట్టే వ్యాఖ్యల నుంచి అణ్వాయుధాలను బహిరంగంగా పరిష్కరించుకునే వరకు వెళ్లింది. తొలుత ఈ విషయంలో చర్చల ద్వారానే వెళ్లాలని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావించగా, అణుబాంబేస్తా...అణుబాంబేస్తా అంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కారాలు మిరియాలు నూరుతున్నాడు. దానికి కౌంటర్ గా ఉత్తరకొరియా కరడుగట్టిన నియంత అధ్యక్షుడిని మట్టుబెడతానని ట్రంప్ కూడా బెదిరింపులకు దిగుతున్నాడు.

అయితే క్షిపణుల విషయంలో అమెరికా కంటే శక్తివంతమైన ఆయుధ సంపతిని అభివృద్ధి చేసుకున్న కొరియా దాడి విషయంలో అనుసరించబోయే వ్యూహాల గురించి అమెరికా ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటుంది. ప్రముఖ అణు శాస్త్రవేత్తలు డేవిడ్ రైట్, మార్కస్ చిల్లర్ స్పందిస్తూ, ఉత్తరకొరియా, అమెరికా మధ్య 5,500 మైళ్ల దూరం ఉంటుందని తెలిపారు. దీంతో ఉత్తరకొరియా, అమెరికాపై అణుక్షిపణిని ప్రయోగిస్తే...అది అక్కడి నుంచి అమెరికాను చేరుకునేందుకు 30 నిముషాలు పట్టే అవకాశం ఉందని. అదే రాజధాని వాషింగ్టన్ డీసీని చేరుకోవాలంటే మాత్రం 39 నిమిషాలని చెబుతున్నారు. అదే సియోల్ (దక్షిణ కొరియా రాజధాని) 6 నిమిషాలు, టోక్యో(జపాన్) కు 10 నిమిషాలు పడుతుందని తెలిపారు.

ఈ దశలో దాడి గురించి అగ్రరాజ్య అధ్యక్షుడికి తెలిపేందుకు ఎంత లేదన్న 25 నిమిషాలు పడుతుందని, అలాంటప్పుడు ట్రంప్‌ చేతిలో కేవలం 10 నిమిషాలు సమయం మాత్రమే మిగిలి ఉంటుందని అన్నారు. ఈ నిమిషాల వ్యవధిలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకోవాలని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఉత్తరకొరియా వద్ద అమెరికా భూభాగాన్ని చేరుకునే సామర్ధ్యం ఉన్న క్షిపణులు లేవని, కానీ తయారు చేసే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతుండగా, ఉత్తర కొరియా రక్షణ మంత్రి ఆ విషయాన్ని ధృవీకరిస్తున్నాడు.

పొరుగు దేశమైన సౌత్ కొరియా సరిహద్దులో థాడ్ పేరుతో ఇప్పటికే అమెరికా శక్తివంతమైన ఆయుధ సంపత్తితో సిద్ధంగా ఉంది. అయితే తమ సముద్ర భూభాగంలో తరచూ అణ్వాయుధాలను ప్రయోగిస్తూ కవ్విస్తున్న ఉత్తర కొరియాపై తొలి దెబ్బ తమదే పడాలన్న ఉద్దేశ్యంతో జపాన్ కూడా ఆయుధాలతో కాపు కాస్తూ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  Donald Trump  North Korea  Airstrikes  39 Minutes  

Other Articles