Chinese Man Runs Along Moving Bullet Train

Chinese passenger gets his finger stuck in train doors

Chinese Man Bullet Train, Man Run Bullet Train, Man Fingers Struck Train, Finger Struck Train, Man Run With Train, Bullet train Horrifying Video, China Bullet Train Video

Man had his finger clamped between doors chased after a moving bullet train till he pull it out. No injures occurred.

ITEMVIDEOS:బుల్లెట్ రైలు స్పీడుతో పరిగెత్తాడు

Posted: 05/18/2017 09:10 AM IST
Chinese passenger gets his finger stuck in train doors

బుల్లెట్ రైలు వేగం ఏంటో మనకు తెలియంది కాదు. రాకెట్ లాగా దూసుకుపోయే వీటిని త్వరలో మన దేశంలోనూ ప్రవేశపెట్టాలన్న ఆలోచన కూడా ఉంది. అలాంటిది ఆ రైలుతోపాటు సమానంగా పరిగెత్తాడు ఇక్కడ ఓ వ్యక్తి. అలాగని అతనేం సూపర్ మ్యాన్, రోబో లో రజనీకాంతో కాదు.. అది అనుకోకుండా జరిగింది.  చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ లో సోమవారం ఓ బుల్లెట్ రైలు తనతోపాటు ప్రయాణికుడిని లాక్కెల్లింది. అతనిని చూసిన పలువురు ప్రయాణికులు ట్రైన్ ను ఆపాలంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు. అయితే చివరకు మాత్రం అతను చిన్న గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. అదేలాగో చూడండి.

తన స్నేహితుడికి వీడ్కోలు చెప్పేందుకు ఓ వ్యక్తి జియాంగ్సు స్టేషన్ కి వచ్చాడు. బుల్లెట్ ట్రెయిన్ ఎక్కించాక బై బై చెబుతున్న క్రమంలో అతని చేయి డోర్ లో ఇరుక్కుపోయింది. ఇంతలో ట్రైన్ బయల్దేరిపోయింది. చేతివేలు బయటకు రాకపోవడంతో రైల్వే ఫ్లాట్ ఫాంపై ఆ వ్యక్తి బుల్లెట్ ట్రైన్ తో పాటుగా పరుగెత్తాడు. అతనిని చూసిన పలువురు ప్రయాణికులు ట్రైన్ ఆపాలంటూ డ్రైవర్ కు సైగలు చేశారు. కానీ. లాభం లేకపోయింది.

 

అయితే బుల్లెట్ ట్రైన్ డోర్ పూర్తిగా మూసుకోని పక్షంలో దానికదే ఆగిపోతుంది. దీంతో ఫ్లాట్ ఫామ్ దాటక ముందే రైలు ఆగిపోయింది. తిరిగి డోర్ తెరుచుకోవడంతో ఆయన ఎలాంటి ప్రమాదం బారిన పడకుండా క్షేమంగా బయటపడ్డాడు. దీనిని వీడియో తీసిన ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Bullet Train  Fingers Struck  

Other Articles

Today on Telugu Wishesh