police to label stickers for vehicles not paying challans వాహనదారుల పరువును తీయనున్న ఆ స్టిక్కర్లు..

Police to label stickers for vehicles not paying challans

traffice police new idea, traffice police rules, traffice police challans, traffic police stickers, traffic police, stickers, violation of traffic rules, police e challans, parking lots, shopping malls, special teams, hyderabad

The traffice police to implement a new idea to get the challans fined by police for violating traffic rules, they are planning to label stickers on those vehicles.

వాహనదారుల పరువును తీయనున్న ఆ స్టిక్కర్లు..

Posted: 05/13/2017 12:41 PM IST
Police to label stickers for vehicles not paying challans

ఇంటిపన్నులు బాకీ వున్న పెద్దల పరువును తీసి వారికున్న గౌరవ మర్యాదలను బజారు పాలు చేసైనా సరే.. తమ బాకీలను వసూలు చేస్తున్న జీహెఛ్ఎంసీ అధికారులను క్షుణ్ణంగా పరిశీలించారో ఏమో తెలియదు కానీ. మేము అ పంథానే అనుసరిస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీసు అధికారులు. ట్రాఫిక రూల్స్ ను అతిక్రమించడంతో పాటు వారిపై వేసిన చాలానాలను చెల్లించడంలో అశ్రద్ద వహిస్తుండటంతో.. వారిపై సరికొత్త వ్యూహాన్ని అనుసరించాలని భావిస్తున్నారు పోలీసు అధికారులు.

జీహెచ్ఎంసీ అధికారుల తరహాలో తాము కూడా వాహనదారులకు తమ చాలానా బాకీల మొత్తం చెల్లించేలా గుర్తు చేయాలని బావిస్తున్నారు. అయితే ఇందుకు జీహెచ్ఎంసీ తరహాలోనే వాహనదారుల పరువు తీస్తే తప్ప.. వారు చలానాలను చెల్లించేందుకు ముందుకు రారని భావించిన పోలీసులు.. అందుకనుగూణంగా చర్యలను తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలకు శిక్షణనిచ్చారు. ఇక త్వరలోనే ట్రాపిక్ పోలీసులు వ్యూహాం అమలుకానుంది. అదేంటంటారా..?

పార్కింగ్ ప్రాంతాల్లో, షాపింగ్ మాల్ లతో పాటు రైల్వే, బస్ స్టేషన్లు ఇలా ఎక్కడ వాహనాలు నిలిపివుంటారో అక్కడకు ట్రాపిక్ పోలీసుల ప్రత్యేక బృందాలు వాలిపోతాయి. వీటితో పాటు జీహెచ్ఎంసీ పార్కింట్ లాట్ లలో కూడా పార్కింగ్ చేసిన వాహనాలలో.. చలానాలు చెల్లించాల్సిన వాహనాలను ట్యాబ్ తో ట్రాఫిక్ విభాగానికి చెందిన సైట్ కు అనుసంధానమై.. వాటిని గుర్తించి వారు ఎన్ని జరిమానాలు కట్టాలో తెలియజేస్తూ.. ఆ సంఖ్యను రాసి స్టిక్కర్ ను వాహనానికి అతికించనున్నారు. ఇలా ప్రతీ పోలిస్ స్టేషన్ పరిధికి చెందిన రెండు మూడు బృందాలు పనిచేయనున్నాయి.

ట్యాబ్ లలో వాహనాల నంబర్లు లేని పక్షంలో కమాండ్ కంట్రోల్ రూంకు నెంబర్ తెలిపి చలానాలు వెళ్లాయా…లేదా…అనే విషయాన్ని కూడా ఈ ప్రత్యేక టీమ్ లు తెలుసుకుంటాయి. మే నెల నుంచి ఈ ప్రణాళికను అమలు చేసేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో అధికారులు వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 25 పోలీస్ స్టేషన్ల పరిధుల్లో సుమారు 38 లక్షల జరిమానాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో 40 శాతం ఇ-చలానాలు వాహనదారులకు చేరినా చెల్లించకుండా ఉన్నారని పోలీసులు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles