Stalin On Why BJP Not Invited To Birthday Bash సారీ..! బీజేపికి అహ్వానం అందుకనే లేదు..

Stalin defends decision to not invite bjp for karuna s birthday celebrations

dmk president m. karunanidhi, karunanidhi, karunanidhi birthday, stalin, stalin bjp, stalin news, dmk news, tamil nadu news, presidential election, congress karunanidhi, birthday, stalin, bjp, dmk, presidential election, congress, tamil nadu, India news, latest news

BJP leaders had reportedly questioned the DMK move to invite the opposition parties alleging that the event was just an excuse to bring all of them together.

సారీ..! ఉద్యమాన్ని అణిచివేసేవారికి అహ్వానం లేదు

Posted: 05/13/2017 11:53 AM IST
Stalin defends decision to not invite bjp for karuna s birthday celebrations

కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి పార్టీపై ధిక్కరస్వరాన్ని అవలంభిస్తున్నడీఎంకే.. తమ పార్టీ అధినేత కరుణానిధి 94వ పుట్టినరోజు వేడుకలు నిర్వహణ పేరుతో జాతీయ రాజకీయ సమీకరణలను ఒక్కసారిగా మార్చివేసేందుకు వ్యూహాలను రచిస్తుంది. వచ్చే నెలలో జరగనున్న ఈ వేడుకులకు బీజేపి వ్యతిరేక పార్టీలన్నింటికీ అహ్వానం పలికిన డీఎంకే.. బీజేపికి మాత్రం అహ్వానాన్ని అందించనంటోంది. ఇందుకు ప్రధాన కారణాన్ని కూడా చెప్పేసింది. ద్రవిడ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కంకణం కట్టుకున్న బీజేపికి అహ్వానం ఎలా పంపుతామని ప్రశ్నించింది.

ద్రవిడ ఉద్యమాన్ని పారద్రోలడమే తమ ప్రథమ కర్తవ్యమని బీజేపి ప్రకటించింది.. ఇలాంటప్పుడు ఆ పార్టీకి ఎలా అహ్వానం పలుకుతామని వారు భావిస్తున్నారని తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, బిహార్‌, ఒడిశా ముఖ్యమంత్రులు సహా పలువురు ముఖ్యనేతలు హాజరవుతున్న వేడుకలకు అలాంటి పార్టీని ఆహ్వానిస్తే.. మా వేదిక అసౌకర్యంగా మారుతుందని అందుకనే వారిని అహ్వానించడం లేదని ఆయన తేల్చిచెప్పారు. డిఎంకే అహ్వానించినా.. తాము జూన్‌ 3న జరిగే కరుణానిధి పుట్టినరోజు వేడుకలు హాజరుకాబోమని ఆ పార్టీ నేతలు స్పష్టం చేసిన నేపథ్యంలో తమ స్టాండ్ చాలా క్లియర్ గా వుందని, బీజేపిని కరుణానిధి జన్మదిన వేడుకలకు ఎలా అహ్వానిస్తామని స్టాలిన్ ప్రశ్నించారు.

బీజేపి వ్యతిరేక పార్టీల అధినేతలను ఈ వేడుకలకు ఆహ్వానించిన డీఎంకే.. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అధికార వ్యతిరేక పార్టీలు సమావేశమవడానికి ఈ కార్యక్రమం వేదిక కానున్నట్లు తెలుస్తోంది. యూపీలో భారీ విజయం తర్వాత బీజేపి దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిపెట్టింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తమయ్యాయి. 2019లో బీజేపిని ఎదుర్కొనేందుకు కూటమిగా ఏర్పడే దిశగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక, తమిళనాడులో ద్రవిడ ఉద్యమం జాతీయపార్టీలకు సవాలుగా మారింది. మరి ఈ క్రమంలో డీఎంకే వ్యూహ, ప్రతివ్యూహాలతో బీజేపి అశలను చిత్తుచేస్తుందా..? లేదా.? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karunanidhi  birthday  stalin  bjp  dmk  presidential election  congress  tamil nadu  

Other Articles