Robber writes apology letter to owner in MP చిలిపి దొంగ.. క్షమించండీ మీ వస్తువలను తిరిగిచ్చేస్తానని లేఖ..

I m sorry will return your valuables soon robber writes apology letter to owner in mp

Robber apology letter to owner, Robber writes apology letter to owner, Robber apology letter, Shakira Khan, TT Nagar police station, robbery, apology letter, police, Bhopal, Madhya Pradesh, India,

Shakira Khan, whose house was burgled by the robber on January 29 this year, produced the letter, purportedly written by the thief, before the investigating officer in TT Nagar police station in the city, leaving him baffled.

దొంగలించిన ఇంటి యజమానురాలికి దొంగ ‘‘లేఖ’’

Posted: 05/10/2017 03:53 PM IST
I m sorry will return your valuables soon robber writes apology letter to owner in mp

క్షమించండీ మీ ఇంట్లో దోంగలించిన వస్తువులు తిరిచి మీకు ఇచ్చేస్తాను.. అంటూ అ ఇంటి యజమానికి ఓ లేఖ వచ్చింది. అది చూసి ఇంటి యజమాని ఖంగుతిన్నింది. అదేంటి తన ఇంట్లో దొంగతనం జరిగి ఐదు నెలలు అవుతుంది.. ఇప్పుడోచ్చి లేఖ వచ్చింది. అదీనూ ఇంట్లో దొంతతనానికి పాల్పడిన దొంగ నుంచి లేఖ రావడం ఏమీటా..? అంటూ యజమాని  కూడా విస్మయానికి గురయ్యాడు. తన ఇంట్లో దొంగతనం చేసిన దొంగ ఈ లేఖను ఇప్పుడు రాయడమేంటని..? యజమానురాలు అలోచనలో పడింది.

వివరాల్లోకి వెళ్తే... భోపాల్ లోని టీటీ నగర్ లో నివాసముండే షాకిరాఖాన్ ఇంట్లో జనవరి 29న దొంగతనం జరిగింది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు మాత్రం దొంగ కోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. అయితే అంగుళం కూడా కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో అమెకు విస్మయం కలిగించేలా దొంగ నుంచి ఓ ఉత్తరం వచ్చింది. క్షమించండీ మీ ఇంట్లో దొంగతనానికి పాల్పడినంతుకు చింతిస్తున్నాను అని వుంది. అంతేకాదు మీ ఇంటో దొంగతనం చేసిన వస్తువులను కూడా త్వరంలోనే తిరిగి అందజేస్తానని వుంది.

బాధితురాలైన షాకిరాఖాన్ మంచి వ్యక్తి అని, కాని తాను ఆర్థిక సంక్షోభంలో ఉన్నందువల్లే దొంగతనానికి పాల్పడాల్సి వచ్చిందని దొంగ లేఖలో పేర్కోన్నాడు. ఇంత చేసిన దొంగ అసలు వస్తువులను త్వరలోనే ఇస్తానని చెప్పగా, ఆమె ఇంట్లో చోరీ సమయంలో లభ్యమైన రెండు గిల్టు నగలను మాత్రం లేఖతో పాటు వెంటనే ఆమెకు పంపించేశాడు. దీంతో ఈ దొంగతనంలో పొరుగింటి వారి హస్తం ఉండే అవకాశముందని టీటీ నగర్ పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనానికి పాల్పడింది మైనర్ బాలుడని అతను రాసిన లేఖను పరిశీలించిన తనువాత పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే సరైన ఆధారాలు లేనిదే నిందితుడిని అరెస్టు చేయలేమని వారు స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Madhya Pradesh  Bhopal  robbery  apology letter  police  

Other Articles