girl performed bike stunt in chandigarh fined బైక్ పై యువతి విన్యాసాలు.. పోలీసులు సిరీయస్

Girl performing bike stunt in chandigarh fined

Chandigarh stunt girl, girl doing stunt in chandigarh, foreign girl doing stunt in chandigarh, bike stunt gil in chandigarh, bike, stunt, girl, chandigarh, Girl, bike stunt, Chandigarh, police, viral video

video of a girl doing a stunt on her motorbike on a Chandigarh road was widely circulated on social media. Chandigarh police tracked the IP address and location of the person who recorded this video.

ITEMVIDEOS: బైక్ పై యువతి విన్యాసాలు.. పోలీసులు సిరీయస్

Posted: 05/10/2017 09:49 AM IST
Girl performing bike stunt in chandigarh fined

సాహసాలు చేస్తున్న యువతీ యువకులకు మంచి తర్ఫీదునిస్తే వారు మరిన్నీ విన్యాసాలతో ప్రజలను అకట్టుకుని వారి ప్రతిభను చాటుకునే వీలుంటుంది. అయితే ఈ విన్యాసాలు నిష్ణాతుల శిక్షణలో తీసుకోవాల్సి వుంటుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే విన్యాసాల ప్రత్యేకమైన గ్రౌండ్ లో నిర్వహించాల్సి వుంటుంది. ఈ విషయం తెలిసో తెలియకో కానీ ఒక పంజాబీ యువతి ద్విచక్రవాహనంపై ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేసి.. చివరకు పోలీసులకు జరిమానా కట్టాల్సి వచ్చింది.

పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతి బైక్ పై బెంబేలెత్తించే స్థాయిలో విన్యాసాలను చేసింది. రవీందర్ కౌర్ అనే యువతి బైక్ పై చేతులను వదిలేసి. అలా నిల్చుని రైడింగ్ చేసింది. అది కూడా నిత్యం వాహనాలతో రద్దీగా వుండే.. చండీగడ్ నుంచి జలంధర్ వెళ్తే రహదారిపైన. దీంతో అమె విన్యాసాలను చూసిన వాహనదారులు బెంబేలెత్తిపోయారు. రహదారిపై ఇలాంటి విన్యాసాలా అంటూ పెదవి విరిచారు. అయితే కొందరు మాత్రం అమెలోని విన్యాసాల నైపుణ్యాన్ని చూసి ప్రోత్సహించారు.

ఇలా అమెను ప్రోత్సహించేక్రమంలో ఓ కారు యజమాని తన కారులో ప్రయాణిస్తూ అమెను చేస్తున్న విన్యాసాలను తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఇంకేముందు దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అంతే అది కాస్తా వైరల్ అయ్యింది. ఓ యువతి బైక్ పై విన్యాసాలను చేయడాన్ని నెట్ జనులు కూడా అదరించారు. అయితే అలా అలా ఇది కాస్తా పంజాబ్ పోలీసులకు చేరిండం.. వారు ఐపీ అడ్రస్ సాయంతో పోస్ట్ చేసిన వ్యక్తిని కనిపెట్టి.. ఎక్కడ ఎప్పుడు ఈ ఘటన జరిగిందన్న వివరాలను సేకరించారు.ః

ఇంకేముంది.. ఆ అమ్యాయి గురించి కూపీ లాగిన పోలీసులు ఎట్టకేలకు అ యువతిని అదుపులోకి తీసుకున్నారు. రహదారిపై ఇలాంటి విన్యాసాలు చేసి తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడంతో పాటు హెల్మెట్‌ ధరించకుండా, కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా నిర్లక్ష్యంతో ప్రమాదకరంగా వాహనాన్ని నడిపినందుకుగానూ మూడు వేల రూపాయల జరిమానా విధించారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన యువతి చివరకు జరిమానా కట్టక తప్పలేదు. అయితే తనకు బైక్, ఓపెన్ టాప్ కార్ల రేసింగులంటే చాలా ఇష్టంమని.. ఆ వాహనాలపై విన్యాసాలు చేస్తూ వెళ్లడాన్ని చాలా ఇష్టపడతానని రవీందర్ కౌర్ మీడియా తెలిపింది. ఆమె విన్యాసాలపై మీరు ఓ లుక్ వేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Girl  bike stunt  Chandigarh  police  jalandhar girl  viral video  

Other Articles