Telangana SHE Teams receives Most Complaints in April

It employees major complaints to she team

Telangana SHE Team, She Teams, Hyderabad IT Girls Trap, Hyderabad IT Employees, She Team Techies, Hyderabad Woman Techies, She Team Complaints, Hyderabad Woman Techies, Techie Girls Trap, Hyderabad Girls Trap, Cyberabad SHE Teams

Cyberabad SHE teams received as many as 86 complaints. Most of the victims were Woman IT employees.

హైదరాబాదీ ఐటీ అమ్మాయిలే టార్గెట్

Posted: 05/02/2017 10:39 AM IST
It employees major complaints to she team

దేశంలో మహిళా భద్రత కోసం కేంద్రం కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ వారిపై అఘాయిత్యాలు మాత్రం అస్సలు ఆగటం లేదు. ఈ దశలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నేరాలు కట్టడి చేయటం కోసం షీ టీమ్స్ పేరుతో స్పెషల్ వింగ్ ను ఏర్పాటు చేశాడు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ఒంటిరిగా ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేయటం, వారిని ఫాలో అయి టార్చర్ పెట్టడం.. ఇలాంటివి చేసిన సమయంలో షీ టీం ను సంప్రదిస్తే చాలూ మాటు వేసి మరీ కామాంధుల పని పడుతున్నారు.

అయితే వాళ్ల వలలో చిక్కుకుని మోసపోతున్న వారిలో ఐటీ కంపెనీల్లో పనిచేసే అమ్మాయిలే అధికంగా ఉన్నారని సైదరాబాద్ షీ టీమ్స్ విభాగం గణాంకాలతోసహా వెల్లడించింది. వారి బలహీనతలను ఉపయోగించుకుని ఆఫీస్సులో కోలీగ్స్, పై అధికారులు, బయటి నుంచి కొందరు వల వేస్తున్నారని, మాయమాటలను నమ్మి ఆకర్షణలో పడి ఆపై సర్వస్వం కోల్పోయి విలపిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే 86 మంది షీ టీమ్స్ ను ఆశ్రయించగా, వీరిలో సగానికి పైగా ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వారే ఉండటం గమనార్హం.

మొత్తం 86 ఫిర్యాదుల్లో 22 కేసులు నమోదు చేసి 12 మందిని జైలుకు పంపామని, వీరిలో అత్యధికులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారని తెలిపారు. 4 అత్యాచార కేసులు, 15 లైంగిక వేధింపుల కేసులు, మిగిలిన వారిపై పెట్టీ కేసులు పెట్టామని, 15 మందికి కౌన్సెలింగ్ ఇప్పించామని షీ టీమ్స్ ఇన్ చార్జ్ సలీమా వెల్లడించారు. హైదరాబాద్ లో 350కి పైగా సాఫ్ట్ వేర్ సంస్థలు ఉండటం, దాదాపు లక్ష మందికి పైగా అమ్మాయిలు పలు రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తుండటంతో, వారి భద్రత నిమిత్తం అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ఎప్పటికప్పుడు ఆకతాయిల ఆటలు కట్టిస్తున్నామని ఆమె చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  She Teams  Woman Techies  Complaints  

Other Articles