Fire Haircut Delhi hairstylist lights hair on fire

An indian barber who lights people s hair on fire to give a cut

Fire haircut India, Fire Haircut Delhi, Fire haircut Video, Indian Barber Flame, Barber Flame, New Haircut, Delhi Barber instead of scissor, Scissor Fire Haircut, Fire Haircut

Indian barber cuts men's hair by setting it on Fire. Trendy Barber uses Fire to Give a Great Haircut. It gains popularity among Delhi youth.

ITEMVIDEOS:ఇదో రకం హెయిర్ కటింగ్

Posted: 05/02/2017 09:57 AM IST
An indian barber who lights people s hair on fire to give a cut

పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్న తీరులో ఇప్పుడున్న యువత ఏదైనా ట్రెండ్ వచ్చిందంటే చాలూ ఎగబడిపోయి ఫాలో అయిపోతుంటారు. ఫేవరెట్ సెలబ్రిటీల డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ ఇలా అన్ని విషయాల్లో కాపీ కొడుతూ ఆనందిస్తుంటారు. ఇంకొందరైతే కేవలం అమ్మాయిలను ఆకర్షించేందుకే ఇలాంటి వేషాలు వేస్తుంటారు. అయితే ఢిల్లీ యూత్ మాత్రం ఓ కొత్త పంథాలో ఇప్పుడు జర్నీ చేస్తున్నారు. ఫైర్ హెయిర్ కటింగ్ కోసం ఎగబడిపోతున్నారు.

ఇంతకీ విషయం ఏంటంటే.. అక్కడి కొన్ని ఫేమస్ సెలూన్లు ఇప్పుడు ఫైర్ హెయిర్ కట్ ను ప్రోత్సహిస్తున్నాయి. కత్తెర అవసరం లేకుండా కేవలం మంటను ఉపయోగించి మీ జట్టును అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నవాళ్లు ఆ పని చేసి చూపిస్తున్నారు కూడా. ముందు జట్టుపై పౌడర్ లేదా జెల్ ను రాస్తారు. ఆ తర్వాత మంటను వెలిగించి జట్టును దువ్వూతు కావాల్సి చోటల్లా సెట్ చేస్తుంటాడు. ఇది ఒక పద్ధతి అయితే క్యాండిల్ ను ఉపయోగించి క్రమపద్ధతిలో కటింగ్ చేయటం మరో పద్ధతి.]

 

అయితే ఇదే కొత్త వ్యవహారం కాదు. ఇంతకు ముందు ముంబైలో ఈ హెయిర్ కట్ బాగా పాపులర్ అయ్యింది. మంట వేసే సమయంలో లైటర్ మాత్రమే ఉపయోగిస్తామని, ఎంతో జాగ్రత్తగా ఈ కటింగ్ ను హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుందని, కాస్త ఆలస్యమైతే ఘోరాలు జరిగే ఆస్కారం ఉంటుందని మావెరిక్ సెలూన్ నిర్వాహకుడు శిల్పానాథ్ చెబుతున్నాడు. కాస్త రిస్క్ అయినా జట్టుతో చేస్తున్న ప్రయోగాలు వర్కవుట్ అవుతుండటంతో ఇప్పుడు దీనికి అక్కడ క్రేజ్ మాములుగా లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barber  Flame  Fire Hare Cut  Delhi Youth  

Other Articles