Political Punch inspired with TDP Official Website

Reason behind political page posts

Political Punch, Political Punch Ravikiran, Political Punch Admin, Political Punch Posts, Political Punch TDP, TDP Official Website, TDP Facebook Page, TDP Inturi Ravikiran, Inturi Ravikiran Interview, Inturi Ravikiran TDP, TDP Posts Political Punch, Inturi Ravikiran, Political Punch Anitha, MLA Anitha Ravikiran, Inturi Ravikiran Case

Political Punch Page Admin Inturi Ravikiran says TDP Website and Posts inspired him. There is no Political Party or intentions behind this scene he added.

‘పొలిటికల్ పంచ్’ ఎలా పుట్టుకొచ్చిందంటే...

Posted: 05/01/2017 11:42 AM IST
Reason behind political page posts

ఆంధ్రప్రదేశ్ లో ‘పొలిటికల్ పంచ్’ వ్యహారం చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఆ పేజీ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్ తనపై ఆరోపణల్లో కాస్త వెనక్కి తగ్గాడు. తనకు ఇలాంటి పోస్ట్ లు పెట్టొద్దన్న విషయం తెలీకనే ఇలా జరిగిందని చెబుతున్నాడు. తెలుగు దేశం ప్రభుత్వం, కీలక నేతలు, అసెంబ్లీని కించపరుస్తూ కథనాలు పెట్టిన రవికిరణ్ వెనకాల ప్రతిపక్ష వైసీపీ హస్తం ఉందన్న ఆరోపణలు తెలిసిందే.

అయితే తాను ఏ పార్టీకి ఫేవర్ కాదని, అన్నింటిపైనా పోస్టులు పెడతానని ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. రెండోసారి విచారణ కోసం తుళ్లూరు పోలీస్ స్టేషన్‌ కు తీసుకురాగా అక్కడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయా పోస్టుల వెనుక ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్(వైసీపీ ఈ మధ్యే నియమించుకుందని టాక్) ప్రమేయం ఉందని కొందరు కథనాలు పుట్టించారు. దీనిపై స్పందిస్తూ కేవలం తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్‌సైట్ చూసే ప్రేరణ పొందానని చెప్పాడు.

టీడీపీ వెబ్‌సైట్ తోపాటు ఆ పార్టీకి సంబంధించిన మరికొన్ని పేజీలు చూశాకే యాంటీ కథనాలను రూపొందించి పోస్ట్ చేశానని, దానివెనకాల ఎవరో ఉన్నట్లు కథనాలు పచ్చి అబద్ధమని, దాని వెనకాల వేరే ఉద్దేశ్యం కూడా ఏం లేదని స్పష్టం చేశాడు. శాసన మండలిపై అభ్యంతరకర పోస్టులు పెట్టకూడదన్న విషయం తెలీక తాను పొరపాటు చేసినట్లు అంగీకరించిన రవికిరణ్, ఇప్పటికే మొత్తం కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ లను అందజేసినట్లు వివరించాడు. ఇక ఎమ్మెల్యే అనితపై తాను పెట్టిన పోస్టింగ్‌ అభ్యంతరకరంగా లేదని, అటువంటప్పుడు తనపై అట్రాసిటీ కేసు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Political Punch  Inturi Ravikiran  TDP Website  

Other Articles