French presidential frontrunner Macron married his teacher

Macron s unusual love story carries on french tradition

France, France Next President, Emmanuel Macron, Emmanuel Macron Wife, Emmanuel Macron Brigitte Trogneux, Emmanuel Macron Love Story, Presidential Candidate Love Story, France Young President, Emmanuel Macron Wife, Brigitte Trogneux

Emmanuel Macron would be France's youngest-ever president. His wife, Brigitte Trogneux, just turned 64. The two met when Macron was 15 years old; Trogneux was his high-school drama teacher.

ప్రెసిడెంట్ అభ్యర్థికి భార్యతోనే చిక్కులు!

Posted: 04/27/2017 08:26 AM IST
Macron s unusual love story carries on french tradition

ప్రేమను కుల, మత, జాతి బేధాలే కాదు వయసు కూడా అడ్డేం కాదు. ఎంత ఏజ్ గ్యాప్ నైనా సరే హృదయంలోని కదలికలు ఇట్టే దగ్గర చేసేస్తాయి. అలాంటిది పెద్దలను ఎదిరించి మరీ వయసులో తన కన్నా 25 ఏళ్లు పెద్ద దాన్ని పెళ్లి చేసుకున్న ఫ్రాన్స్‌ అధ్యక్ష అభ్యర్థి ఎమ్మాన్యుయల్‌ మాక్రన్ కు ఇప్పుడు ఆమెతోనే చిక్కులు ఎదురవుతున్నాయి. ఫ్రాన్స్ రాజకీయాల్లో ఇలాంటి వ్యవహారాలు కొత్తేం కాకపోయినప్పటికీ ఆసక్తికరంగా  ఇంతకీ అతగాడి లవ్ స్టోరీ ఏంటో ఓ లుక్కేద్దాం.

అమియెన్స్‌ లోని జీస్యూట్‌ జూనియర్‌ కాలేజీలో చదువుతున్న రోజుల్లో మాక్రన్‌ ప్రేమలో పడ్డారు. అప్పుడాయన వయసు సరిగ్గా 15ఏళ్లు. ఇంతకీ ఆయన ప్రేమించిందెవరంటే.. మాక్రన్‌కు పాఠాలు బోధించే 40 ఏళ్ల లెక్చరర్‌ బ్రిగిట్టి ట్రాగ్‌ న్యూను. అప్పటికే ఆమెకు పెళ్లయి, ముగ్గురు పిల్లలున్నారు. అంతే కాకుండా ఆమె కుమార్తెల్లో ఒకరు మాక్రన్ తో పాటు చదువుకునేది. అతని ప్రేమను బ్రిగెట్టీ మొదట్లో ఆకర్షణగా భావించి, సరదాగా తీసుకునేది. అయితే ఒక రోజు కాలేజీలో నాటకం వేస్తుండగా ఆయన నేరుగా వెళ్లి ‌ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. అప్పటి నుంచి వారి మధ్య ప్రేమ చిగురించింది. అయితే అందరి తల్లిదండ్రుల్లాగే మాక్రన్‌ తల్లిదండ్రులు వారి ప్రేమకు అభ్యంతరం తెలిపారు. అంతే కాకుండా తమ కొడుక్కి దూరంగా ఉండాలంటూ ఆమెను సీరియస్ గా హెచ్చరించారు. అంతే కాకుండా ఆమె దూరంగా ఉంచేందుకు మాక్రన్ ను పారిస్‌ కు ఉన్నత చదువుల కోసం పంపారు.

అయితే ఈ దూరం వారిని ఎడబాటు చేయడం కంటే దగ్గర చేసింది. వీరి మధ్య ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఇంతలో మాక్రన్‌ డిగ్రీ పూర్తి చేయగా, బ్రిగిట్టీ తన భర్తను వదిలేసి మాక్రన్‌ కోసం పారిస్‌ వచ్చేశారు. దీంతో 2007లో వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం వారి కుటుంబంలో ఆందోళన నింపినా...వారి కోరిక మేరకు తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు గౌరవించారు. దీంతో వారి వివాహం జరిగి పదేళ్లైంది. ప్రస్తుతం మాక్రన్ వయసు 39 ఏళ్లు కాగా, బ్రిగెట్టీ వయసు 64 ఏళ్లు.

ఎన్నికల్లో తొలిరౌండ్లో విజయం సాధించాడు. ఆ గెలుపు తర్వాత వీరిద్దరు స్టేజీ మీదే ముద్దు పెట్టుకోవటం విమర్శలకు తావిచ్చింది. ప్రతిపక్ష అభ్యర్థులు ఈ అంశాన్నే ఆయుధంగా చేసుకుని విరుచుకుపడుుతున్నారు.  అయితేనేం మాక్రన్‌ తదుపరి ఫ్రాన్స్‌ దేశాధ్యక్షుడు కావటం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ కుర్ర కేండిటేట్ కోసం విశేషాలు తెలుసుకునేందుకు ప్రపంచం అంతా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఆ ముదురు ప్రేమ కథ ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. సర్వేలు చెబుతున్నట్టు మాక్రన్ ఫ్రాన్స్ అధ్యక్షుడైతే, చిన్నవయసులోనే ఆ ఘనత సాధించినవాడిగా చరిత్రకెక్కుతాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : France  Emmanuel Macron  Brigitte Trogneux  Love Story  

Other Articles