Hyderabad Minor killed himself over Facebook fake account

Facebook fake account kills minor in hyderabad

Hyderabad Minor, Hyderabad Student Suicide, Facebook Fake Account, Hyderabad Student Teacher, Student Create Facebook Fake Account, Minor Abetment Suicide, Minor Suicide

Hyderabad School Student Creates Teacher Facebook Fake Profile uploaded obscene content. Co students scolded and abused the victim. Later he committed suicide. Minors held for abetment to suicide.

ఫేస్ బుక్ ఫేక్ అకౌంట్ తో ప్రాణాలు పోయాయి

Posted: 04/26/2017 09:17 AM IST
Facebook fake account kills minor in hyderabad

గురువు దైవంతో సమానం అంటారు. కానీ, వాళ్లకు కావాల్సిన గౌరవం ఇప్పట్లో దొరకటం చాలా కష్టంగా మారింది. దానికి తోడు వేధింపుల పర్వాలు ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయాయి. అయితే ఇక్కడో విద్యార్థి మాత్రం తనకు చదువు చెప్పే టీచర్ ను అభాసుపాలు చేయాలనుకున్నాడు. కానీ, చివరకు అదే అతని ప్రాణం తీసినట్లు అయ్యింది. హైదరాబాద్ శివార్లో జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హస్తినాపురం నార్త్‌ ఎక్స్‌ టెన్షన్‌ లోని నివాసముండే 16 ఏళ్ల ఓ విద్యార్థి ఇంజాపూర్ గవర్నమెంట్ స్కూలో చదువుతున్నాడు. తన స్కూల్లో పాఠాలు చెప్పే ఓ మహిళా టీచర్ పేరు మీద ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. అందులో బూతు బొమ్మలు, వీడియోలు అప్ లోడ్ చేయటం ప్రారంభించాడు. ఈ విషయం మెల్లిగా పాకి చివరకు అదే స్కూల్లో చదివిన మరికొందరి చెవిన పడింది.

అతన్ని బెదిరించి, ఇంటర్నెట్ కేఫ్ కు తీసుకెళ్లి మరీ ఆ అకౌంట్ ను డిలీట్ చేయించి, ఇంకోసారి ఇలా చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. అయితే తాను చేసిన పని ఇంట్లో తెలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ఆందోళనతో వణికిపోయాడు ఆ విద్యార్థి. ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులకు విచారణలో అసలు విషయాలు తెలిసి షాక్ తిన్నారు. బెదిరించిన విద్యార్థులను ఆత్మహత్యకు పురిగొల్పారన్న కారణంతో అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad Minor  Facebook  Fake Account  Suicide  

Other Articles