Pawan Kalyan salutes to Osmania University on centenary celebrations

Pawan kalyan special salutes to ou

Janasena Party Chief Pawan Kalyan salutes Osmania University on its centenary celebrations. He said OU developed intellectuals, scientists, doctors, engineers and artistes.

పవన్ కళ్యాణ్ స్పెషల్ సెల్యూట్ దేనికి?

Posted: 04/26/2017 08:48 AM IST
Pawan kalyan special salutes to ou

ఉద్యమాల పురిటి గడ్డగా పేరొందిన ఉస్మానియా యూనివర్సిటీ తన వందేళ్ల ఉత్సవాలకు సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా తన భావాలను పంచుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీకి వందనం పేరుతో ఓ ప్రెస్ నోట్ విడుదల చేయటం విశేషం.

``తమసోమా జ్యోతిర్గమయ అనే దివ్య సూక్తిని తన నుదుటన ధరించి - లక్షలాదిమందికి జ్ఞాన వెలుగులను పంచిపెడుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రణామాలు అర్పిస్తున్నాను. బ్రిటిష్ విద్యావేత్త విల్చెడ్ సుయిన్ బ్లంట్ ఆలోచనల్లో ఊపిరిపోసుకుని ఏడో నిజాం నవాబ్ ఉస్మాన్ మీర్ అలీఖాన్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ తల్లి నీడలో చదువుకున్న ఎందరో విద్యార్థులు మేధావులు - శాస్త్రవేత్తలు - ఇంజినీర్లు - డాక్టర్లు - కళాకారులుగా దేశానికి సేవలు అందిస్తూనే వున్నారు. తెలుగు ముద్దుబిడ్డ ఈ దేశ ప్రధానమంత్రి పీఠం అధిష్టించిన పి.వి.నరసింహారావు ఈ తల్లి ఒడిలో పెరిగినవాడే.

ముఖ్యమంత్రులు - మంత్రులను తీర్చిదిద్దిన ఈ చదువుల మాత శత వసంతాల పండుగను రేపటి నుంచి జరుపుకుంటున్న శుభ సందర్భంగా నా తరపున - జనసేన శ్రేణుల తరుపున శుభాకాంక్షలు... జైహింద్`` అంటూ పవన్ శుభాకాంక్షలు తెలియజేశాడు. 1917 లో కేవలం 25 మంది బోధనాసిబ్బంది, 225 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం, నేడు 10,000 లకు పైగా విద్యార్థులు, 1200 మంది టీచింగ్ స్టాఫ్ తో కొనసాగుతోంది. నేడు(బుధవారం) రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ఓయూ శతజయంతి ఉత్సవాలు మధ్యాహ్నం నుంచి మొదలవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles