Baba Ramdev's accident goes viral on Whatsapp రోడ్డు ప్రమాదంలో భాబా రాందేవ్.. సోషల్ మీడియాలో వైరల్ న్యూస్

Hoax message of baba ramdev s accident goes viral on whatsapp

Baba Ramdev Accidental, Baba Ramdev, Baba Ramdev accident, Baba Ramdev pictures on social media, baba ramdev hoax message, Mumbai-Pune Highwaym Baba Ramdev, Accident, social media, Mumbai-Pune Highway, Viral news, Hoax message

A hoax message of a car accident involving Baba Ramdev on the Mumbai-Pune highway on Tuesday had gone viral on Whatsapp.

రోడ్డు ప్రమాదంలో భాబా రాందేవ్.. సోషల్ మీడియాలో వైరల్ న్యూస్

Posted: 04/25/2017 05:40 PM IST
Hoax message of baba ramdev s accident goes viral on whatsapp

సోషల్ మీడియాలో ఒక్కోసారి వైరల్ గా మారుతున్న కథనాలు అంతా ఫేక్ అని తేలుస్తుండడంతో అసలు ఏది నిజమైన వైరల్, ఏది పేక్ అన్నది తెలియక నెట్ జనులు అందోళనకు గురవుతున్నారు. బతికున్న రాజకీయా నాయకులపై కూడా అనవసర వార్తలు పెట్టి దానిని వైరల్ చేస్తూ.. నానా హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురిపై పోలీసులు చర్యలు తీసుకున్నా.. అనవసర అబద్దపు వార్తలను మాత్రం సోషల్ మీడియాలో పెట్టి నెట్ జనులను కంగారె పెట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ వార్తా కథనమే వైరల్ గా మారింది.

ప్రముఖ యోగా గురువు, పతంజలి ఉత్పత్తుల అధినేత బాబా రాందేవ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని.. తీవ్ర గాయాలపాలైన ఆయనకు మెరుగైన చికిత్సనందించేందుకు స్థానిక అస్పత్రికి తరలించినట్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదంలో పల్టీలు కొటిందని కూడా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ప్రమాదంలో గాయపడిన బాబా రాందేవ్ ను స్ట్రెచర్‌ మీద తరలిస్తున్నట్టు ఉన్న ఈ ఫొటోలు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో షేర్‌ అవుతున్నాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అయితే, ఈ కథనాలు, ఫొటోలూ అన్నీ ఫేక్ అని తేలిపోయింది. బాబా రాందేవ్ సురక్షితంగా, క్షేమంగా వున్నారని తెలిసింది. హరిద్వార్ లో ఆయన వున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నిజంకాదని కూడా తెలిసింది. ఫొటోమార్ఫింగ్‌ చేసిన ఫొటోలతో ఎవరో కావాలనే ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ఈ ప్రచారం చేస్తున్నట్టు ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. ఆయన కారు పల్టీలు కొట్టగా కారు టాప్ బాగంలోనే నుజ్జునుజ్జు అయ్యింది. ఇక ఆ కారుకు ముందుర ఎర్రని బోర్డులో ప్రభుత్వ వాహానం అని రాసివుంది. కాగా మరో ఫోలోటో బాబా రాందేవ్ ను అంబులెన్స్ లో అస్పత్రికి తరలిస్తున్న ఫోటో.. కూడా ఇన్ సర్ట్ చేసివుంది. అయితే బాబా రాందేవ్ అభిమానులు ఈ వదంతులను నమ్మవద్దని ఇవన్నీ ఫేక్ అని పతాంజలి సంస్థ వర్గాలు పేర్కోంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baba Ramdev  Accident  social media  Mumbai-Pune Highway  Viral news  Hoax message  

Other Articles