Abigail Breslin did not report her rape to police నటిపై అత్యాచారం.. కానీ పోలీసులకు పిర్యాదు చేయలేదు..

Abigail breslin did not report her rape to police

actress raped, hollywood actress raped, sexual assult on abigail breslin, abigail breslin raped, abigail breslin ex partner, abigail breslin rape, Former child star Abigail Breslin raped, Celebrity, abigail breslin rape, abigail breslin sexual assault, abigail breslin unreported rape, abigail breslin instagram, hollywood news, latest news, crime news

Abigail Breslin has candidly explained why she did not report her rape, after previously revealing she was allegedly sexually assaulted by an ex-partner.

నటిపై అత్యాచారం.. కానీ పోలీసులకు పిర్యాదు చేయలేదు..

Posted: 04/25/2017 04:47 PM IST
Abigail breslin did not report her rape to police

ఉత్తమ బాలనటిగా పేరుతెచ్చుకుని ఇప్పటికీ ఇంకా చిత్రసీమలో కొనసాగుతున్న ఆ నటిపై అత్యాచారం జరిగింది. అయితే ఇప్పుడు కాదు. కొన్ని నెలల కిందటే అమెపై ఈ దారుణానికి ఒటిగట్టాడు ఓ మగమృగం. అయితే పైశిచికత్వంతో తనపై ఈ దారుణానికి ఒడిగట్టింది తనకు అత్యంతగా తెలిసిన వ్యక్తేనని, ఈ దారుణం పట్ల అమె ఎవరికీ ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని చెప్పారు. ఎందుకు ఈ అఘాయిత్యంపై పోలీసులకు పిర్యాదు చేయలేదన్న విషయమై అమె తాజాగా వివరణ ఇచ్చారు. ఇంతవరకు ఓకే కానీ ఎవరా నటి అంటున్నారా..?

అక్కడికే వస్తున్నాం ఆ నటి ఎవరో కాదు ఎబిగెయిల్‌ బ్రెస్లిన్‌. హాలివుడ్ లో బాలనటిగా ప్రఖ్యాతి చెందింది. ఇక నటనపై అనకున్న అభిమానంతో అమెరీకన్ చిత్రాలలో నటిగా కొనసాగుతున్న బ్రెస్లిన్.. తనకు గతంలో జరిగిన గాయమై వివరణనిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. తన మాజీ ప్రియుడే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని అమె పేర్కోనింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పింది. బ్రిస్లిన్ మాత్రమే కాదు.. ఇలాంటి దాడులను తాము ఎదుర్కోన్నామంటూ ఇప్పటికే కొందరు హాలీవుడ్‌ నటీమణులు వెల్లడించారు.

అయితే పోలీసులకు పిర్యాదు చేయకపోవడంపై వివరణ ఇచ్చిన 21 ఏళ్ల బ్రెస్లిన్‌.. చాలా రేప్‌ కేసుల్లో నిందితులకు శిక్ష పడలేదన్నది కూడా ఒక కారణమని తెలిపింది. తనపై అత్యాచారం జరగ్గానే షాక్ లో వుండిపోయానని.. దాంతో పాటు రేప్‌ చేసిన వ్యక్తితో అమెకు రిలేషన్‌షిప్‌ కూడా వుండిందని.. అతను తనను లైంగికదాడి చేశాడని చెప్పినా పోలీసులు విశ్వసించరని భయంతో పోలీసులకు పిర్యాదు చేయలేదని చెప్పారు. దీంతో పాటు ఈ కేసు నిలబడని పక్షంతో అతని నుంచి మరిన్నీ బాధాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భావనతోనే తాను పిర్యాదు చేయలేదని బ్రెస్లెన్ వివరించింది.

తన మాజీ ప్రియుడు తనపై లైంగికదాడి చేశాడని, తానెవరికీ చెప్పుకోలేకపోవడానికి ఇవే కారణాలను కూడా తెలిపింది. వీటితో పాటు ఆతని నుంచి తన కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా బాధపడవద్దని భావించిని తనకు జరిగిన పరాభవంపై మౌనంగా వుండిపోయానని చెప్పింది. అయితే ఈ దారుణ ఘటన నుంచి భయటపడేందుకు తాను చికిత్స కూడా తీసుకున్నానని చెప్పింది. ఏడాదిన్నర క్రితం ఈ దారుణం జరిగినట్టు తెలిపింది. లైంగికదాడి బాధితులకు అండగా నిలుస్తూ ఆమె తన గతాన్ని వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles