Consumers get a free hand on hotel service charge payout ‘‘హోట్లళ్లు, రెస్టారెంట్లలో ఇక సర్వీస్ చార్జ్ తప్పనిసరి కాదు’’

Service charge in hotels restaurants not mandatory now says ram vilas paswan

Ram vilas paswan, Service charge, restaurants, not mandatory, govt issues guidelines, hotels

Dining in hotels and restaurants will be less expensive now as the government has made service charge on hotel and restaurant bills ‘totally voluntary’.

‘‘హోట్లళ్లు, రెస్టారెంట్లలో ఇక సర్వీస్ చార్జ్ తప్పనిసరి కాదు’’

Posted: 04/21/2017 08:16 PM IST
Service charge in hotels restaurants not mandatory now says ram vilas paswan

హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లే వినియోగదారులను కేంద్ర ప్రభుత్వం కాస్త కరుణించింది. టిమ్స్ రూపంలో కస్టమర్లు ఇచ్చే పారితోషకాన్ని సర్వీసు చార్జ్ రూపంలో హోటల్ యాజమాన్యాలు సేకరించే విధానాన్నికి చెక్ పెట్టింది. సేవా రుసుము (సర్వీస్ ఛార్జ్)ను హోటళ్ళు, రెస్టారెంట్లు నిర్ణయించరాదనిస్పష్టం చేస్తూ.. సర్వీసు బాదుడుతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కొంత ఊరట కల్పించింది. సర్వసు చార్జీల చెల్లింపు నిర్ణయాన్ని కస్టమర్లకే వదిలిపెట్టాలని పేర్కొంది. ఈ మేరకు గైడలైన్స్‌ ను  కేంద్రప్రభుత్వం రూపొందించింది.  క‌స్టమ‌ర్ల నుంచి వ‌సూలు చేసే స‌ర్వీస్ ఛార్జ్‌పై కేంద్ర ప్రభుత్వం నియ‌మావ‌ళిని విడుదల చేసింది.

ఈ మేరకు కేంద్ర ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సామాజిక మాద్యమం ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించారు. రెస్టారెంట్లలో స‌ర్వీస్ ఛార్జ్ త‌ప్పనిస‌రి అంశం కాద‌ని, అది వ్యక్తగ‌త‌మైన‌ద‌ని అన్నారు. సర్వీస్‌ చార్జ్‌ ఎంత చెల్లించాలి అని నిర్ణయించే అధికారం హోటల్స్‌కు, రెస్టారెంట్లకు లేదని, అది కస్టమర్ల విజ్ఞతకు వదిలివేయాలని ఆయన ట్వీట్‌ చేశారు. కస్టమర్లపై సేవా రుసుము విధింపుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించినట్లు తెలిపారు.
 
ఆహార, పానీయాల బిల్లులపై సర్వీస్ ఛార్జి విధింపుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గత వారం ప్రభుత్వం ప్రకటించింది. హోటళ్ళు, రెస్టారెంట్లు టిప్స్‌కు బదులుగా సర్వీస్ ఛార్జి రూపంలో 5-20 శాతం మేరకు కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల ప్రతినిధులతో చర్చించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను సమీక్షించి ఈ మేరకు సవరణలు ప్రతిపాదించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram vilas paswan  Service charge  restaurants  not mandatory  govt issues guidelines  hotels  

Other Articles