Real Fight of Big Lizards and Snake కబళిస్తుందని తెలిసినా.. స్నేహం కోసం పోరాటం

Lizard fights with snake for friend

wild lizards, snake, snakes, snake island, snakehips, snake eater, snake prank, animals, snake bite, lizards mating, lizards running from snakes, lizards fight

Real fight between lizard and snake for the sake of friendship, atlast lizard wins

ITEMVIDEOS: కబళిస్తుందని తెలిసినా.. స్నేహం కోసం పోరాటం

Posted: 04/21/2017 09:37 PM IST
Lizard fights with snake for friend

యే దోసితీ హమ్ నహీ చోడేంగే. చోడేంగేతో దమ మగర్ తేరా సాత్ న చోడేంగే.. దోస్తే మేరా దోస్తే నువ్వు నా ప్రాణం.. నేహానికన్నా మిన్నా లోకాన లేదురా. ఇలా ఎన్ని పాటలు పాడుకున్న అన్ని స్నేహితుల కోసమే అయితే స్నేహం అన్నది కేవలం మనుష జాతికి మాత్రమే పరిమితమైంది కాదు. ప్రాణకోటీలోని అన్ని జీవాలకు ఇది వరం. నమ్మశక్యంగా లేదా..? త‌న స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడ‌ని తెలిస్తే త‌న ప్రాణం కూడా లెక్క చేయ‌కుండా కాపాడేందుకు ప్ర‌య‌త్నించే స్నేహితులు అన్ని జీవరాశుల్లోనూ వున్నారు. కబళించి వేస్తుందని తెలిసినా.. తన స్నేహితుడిని రక్ష్ంచేందుకు ఈ జీవి ఎలా పోరాడిందో చూస్తే మీరే అవునని అంటారు.

ఇక్క‌డ కూడా గోడ‌పై ఓ బ‌ల్లి స‌ర‌దాగా తిరుగుతుండ‌గా అనుకోని ప‌రిణామం ఎదురైంది. పెద్ద పాము ఒక‌టి ఈ బ‌ల్లిని తినేందుకు ప్ర‌య‌త్నించింది. జాగ్ర‌త్త‌గా కాపుకాసిన పాము ఆ బ‌ల్లి అటుగా రాగానే ఒక్క సారిగా పంజా విసిరింది. బ‌ల్లిని చుట్టేసింది. ఊపిరాడ‌క ఇబ్బంది ప‌డుతున్న ఆ బ‌ల్లిని మ‌రో బ‌ల్లి చూసింది. త‌న స్నేహితుడు ఆప‌ద‌లో ఉన్నాడ‌ని తెలిసి వెంట‌నే రంగంలోకి దిగింది. పామును నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేసింది. పాము ఈ బ‌ల్లి మ‌ధ్య భీక‌ర పోరు సాగింది.

ఈ పోరు మ‌ధ్య‌లో గ‌ట్టిగా ప‌ట్టుకున్న బ‌ల్లిని విడిచిన‌ట్లు క‌నిపించినా పూర్తిగా వ‌ద‌ల్లేదు. అలా ఆ బ‌ల్లిని ప‌ట్టుకుంటూనే మ‌రో బ‌ల్లిపై దాడి చేసింది. చివరకు బల్లి గెలిచింది. ఈ పోరులో పాము తన పట్టుకోల్పోయి కిందపడగా బల్లి గొడకు అత్తుకునే వుంది, ఇక తన స్నేహితుడైన బల్లి కూడా అలాగే గోడకు అత్తుకుని వుండిపోయింది. పాము-బ‌ల్లిల మ‌ధ్య జ‌రిగిన భీక‌ర‌పోరును ఒక‌రు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అయ్యింది. ఈ యుద్ధంలో బ‌ల్లి ఓడిపోలేదు కానీ త‌న చివ‌రి ప్ర‌య‌త్నం వ‌ర‌కు త‌న స్నేహితుడిని కాపాడేందుకు పోరాడింది. చివ‌రిగా విజ‌యం సాధించింది.  ఎట్ట‌కేల‌కు పాము వ‌ద‌ల‌డంతో బ‌తుకు జీవుడా అంటూ అక్క‌డినుంచి వెళ్లిపోయింది ఆ బ‌ల్లి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wild lizards  snake  encounter  friendship  trending video  

Other Articles