Alimony to Be 25% of Husband's Net Salary fixes SC రెండో పెళ్లి చేసుకున్నా మొదటి భార్యకు అస్తిలో వాటా ఇవ్వాల్సిందే..!

Supreme court fixes alimony at 25 percent of a man s salary

maintenance, Supreme Court, Permanent alimony, benchmark for maintenance, amount of maintenance, frist wife

The BJP Maharashtra chief has hit the headlines over his son’s opulent wedding that involved sleek video invites, designer sets and a lavish ceremony monitored by police using drone-mounted cameras.

రెండో పెళ్లి చేసుకున్నా మొదటి భార్యకు భరణం ఇవ్వాల్సిందే..!

Posted: 04/21/2017 07:31 PM IST
Supreme court fixes alimony at 25 percent of a man s salary

మొదటి భార్య వుండగానే అమెకు విడాకులిచ్చి.. రెండో వివాహం చేసుకోవాలనుకునే వారికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇలా చేసే వారు తమ మొదటి భార్యకు ఖచ్చితంగా భరణాన్ని ఇవ్వాల్సిందే. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. ఉద్యోగం లేని వారు తమ అస్తులలో వాటానైనా వదులుకోవాల్సిందే. అయితే మొదటి భార్యకు చెల్లించాల్సిన భరణం విషయంలో ఒక్కో న్యాయస్థానం ఒక్కోమాదిరిగా తీర్పులను వెల్లడించడంతో.. దీనిపై కూడా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చేసింది.

భార్యను వదిలేసినా.. లేక మరో మహిళను పెళ్లి చేసుకున్నా మొద‌టి భార్యకు 25శాతం భ‌ర‌ణంగా చెల్లించాల‌ని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశిస్తూ.. ఇక ఈ విషయంలో ఎలాంటి అస్పష్టత లేకుండా క్లారిటీ ఇచ్చేసింది. మొద‌టి భార్య జీవితానికి భరణం మద్దుతుగా నిలిచేలా, అమెకు సమాజంలో మొదటి భార్యను వ‌దిలేస్తే ఆమెకు భ‌ర్త జీతంలో నుంచి 25 శాతం త‌ప్పకుండా భ‌ర‌ణంగా ఇవ్వాల్సిందేనంటూ సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును వెల్లడించింది. గౌరవప్రదంగా బతికేలా భరణం దోహదపడాలని తెలిపింది.

బెంగాల్ రాష్ట్రాం హూగ్లీకి చెందిన ఓ వ్యక్తి నెల జీతం రూ.95527 కాగా త‌న మొదటి భార్యకు నెల‌కు రూ.20వేలు భ‌ర‌ణంగా ఇవ్వాల‌ని జ‌స్టిస్ ఆర్ భానుమ‌తి, జ‌స్టిస్ శాంత‌న‌గౌడ‌ర్‌తో కూడిన ధ‌ర్మాస‌నం సూచించింది. అంత‌కు ముందు కోల్‌క‌తా హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన వ్యక్తికి రూ.23వేలు భ‌ర‌ణంగా ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఆ వ్య‌క్తి.  అయితే కోల్‌క‌త్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును త‌ప్పుబ‌ట్టలేమ‌ని చెప్పిన సుప్రీం ధ‌ర్మాస‌నం… వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు క‌నుక ఆ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నందున‌ భ‌ర‌ణాన్ని రూ.3వేల‌కు త‌గ్గించి రూ.20వేలు చేసిన‌ట్లు సుప్రీం కోర్టు చెప్పింది.

అయితే ఒకవేళ భర్తకు ఎలాంటి ఉద్యోగం లేని పక్షంలో ఎలా అన్న విషయంలోనూ అత్యున్నత న్యాయస్థానం క్లారిటీ ఇచ్చేసింది. భర్తఉద్యోగం సద్యోగం లేకుండా తిరిగేవాడైతే అతనికి చెందిన ఆస్తులు ఉన్నాకూడా వాటిలో తన మొదటి భార్యకు హక్కులు ఉంటాయని దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇక పెళ్లిళ్ల ఎన్నైనా చేసుకుంటాం.. పెళ్లాలను పోషించుకుంటాం అన్న భర్తలు పారాహుషార్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles