Combiflam, D Cold Total found substandard by drug regulator డీకోల్డ్, కాంబిప్లామ్ వాడుతున్నారా..? ఒక్క నిమిషం..!

Combiflam d cold total found substandard by drug regulator report

d cold total, combiflam, drugs, central drugs standard control organization, cdsco, sanofi india, indian medicines, medical news, latest news

CDSCO has found popular painkiller Combiflam and cold medicine D Cold Total, manufactured and sold by Sanofi India and Reckitt Benckiser Healthcare India, respectively, to be substandard in its tests

డీకోల్డ్, కాంబిప్లామ్ వాడుతున్నారా..? ఒక్క నిమిషం..!

Posted: 04/21/2017 06:39 PM IST
Combiflam d cold total found substandard by drug regulator report

సొంత వైద్యం హానికరం అని, వైద్యుల సలహాలు లేనిదే ఏ మందులు మాత్రలు వేసుకోరాదని డాక్టర్లతో పాటు ఎందరో ఎన్ని రకాలుగానో చెప్పినా.. ఈ చిన్నదానికి వాళ్ల వద్దకు వెళ్లేదేంటి అంటూ నిర్లక్ష్యం చేస్తాం. జలుబు చేస్తేనో లేక  ఒళ్లు నొప్పులుగా ఉంటేనో వైద్యులు ఫీజులు చెల్లించడం ఎందుకు వాళ్లు రాసే ఖరీదైన మందులు వాడటం ఎందుకు అని అనుకుంటాం. కానీ ఇలా చేయడం సబబు కాదని మరోమారు తేలిపోయింది. జలుబు చేస్తే డీకోల్ట్ టోటల్,, ఒళ్లు నొప్పులుగా ఉంటే కాంబిప్లీమ్ వేసుకుంటూ ఆయా వ్యాపారాలను వందల కోట్లకు పెంచాం. కానీ వారు మాత్రం ఏం చేస్తున్నారారు.

ఈ ప్రశ్నకు బదులు తెలుసుకుంటూ అవాక్కవాల్సిందే. ఎందుకంటారా..? దేశంలోని కొట్ల మంది జలుబు ఒళ్లునోప్పులకు ఈ మాత్రలను వేసుకుంటున్నారని ఆయా సంస్థలకు తెలిసినా వారు మాత్రం నాసిరకం మందులను మార్కెట్లోకి వదలి సోమ్ముచేసుకుంటున్నారు. సామాన్య ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ రెండు మాత్రలు ప్రమాణాలకు ఆమడదూరంలో ఉన్నాయని, పూర్తిగా నాసిరకం అని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) స్పష్టం చేసింది.

కాంబిఫ్లామ్ మాత్రలను సనోఫి ఇండియా సంస్థ తయారు చేస్తుండగా, డీకోల్డ్ టోటల్‌ను రెకిట్ బెంకిజర్ హెల్త్‌కేర్ ఇండియా సంస్థ తయారు చేస్తోంది. ప్రజారోగ్యాలతో ఈ సంస్థలు ఆడలాడుతున్నాయిన వాటికి నోటీసులు కూడా జారీ చేసింది. వీటితో పాటు మొత్తంగా మార్కెట్లలో లభించే 60 మందులు నాసికరంగా, నాణ్యతాలోపంతో వున్నాయని వాటిన్నింటికీ నోటీసులను పంపింది. అయితే ప్రముఖంగా కోట్ల రూపాయలలో టర్నోవర్ వున్న డీకోల్ట్ టోటల్, కాంబిఫ్లామ్ లతో పాటు సిప్లా తయారు చేసే ఓఫ్లాక్స్-100 డీటీ, థియో ఆస్థలిన్ టాబ్లెట్లు, కాడిలా వాళ్లు తయారుచేసే కాడిలోస్ సొల్యూషన్ కూడా లోపభూయిష్టంగానే వున్నాయని కేంద్ర ఔషద ప్రమాణాల నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles