అమెరికా ఓవరాక్షన్... అస్సలు వేస్ట్ కాలేదంట! | Massive US Bomb In Afghanistan Killed 92 From ISIS.

Dozens of isis terrorists killed in massive us bomb strike

US Massive Bomb Attack, Mother of All Bombs Killed, ISIS Mother of All Bombs, MOAB Attack, Afghanistan MOAB result, America Bomb Strike not Wasted, Massive Bomb Strike ISIS, 94 ISIS America Big Bomb, Big Bomb Attack Details

US 'Mother of All Bombs' kills 94 ISIS terrorists in Afghanistan; no civilian casualty army reported.

అమెరికా అతి అస్సలు వేస్ట్ కాలేదుగా....

Posted: 04/15/2017 04:47 PM IST
Dozens of isis terrorists killed in massive us bomb strike

ఉగ్రవాదంపై ఉక్కు పాదం పేరిట పరోక్షంగా కొన్ని దేశాలకు తమ బలనిరూపణ చేసుకున్న అమెరికా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ను ప్రయోగించటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. అణు రహిత బాంబే అయినప్పటికీ దాని తీవ్రత మూలంగా చుట్టుపక్కల ప్రాంతాలు భారీగా దెబ్బతినే అవకాశం, సామాన్యులు చనిపోయే వీలుందన్న వాదనను బలంగా వినిపిస్తూ అగ్రరాజ్యం చర్యను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.

అయితే ఉగ్రవాదులను మట్టుపెట్టడమే లక్ష్యంగా నాన్ గార్హర్ ప్రొవిన్స్ లో జరిగిన జీబీయూ-43/బీ (ఎంఓఏబీ)తో దాడి చేసిన దాడి వేస్టే కాలేదని సమాచారం. ఈ దాడిలో 94 మంది ఉగ్రవాదులు మట్టికరిచినట్లు అఘ్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. తొలుత 36 మందే అని చెప్పినప్పటికీ, తర్వాత గుహల్లో చిక్కుకున్న మృతదేహాల సంఖ్యను వెలికి తీయటంతో ఆ సంఖ్య 90కి పైగా చేరిందని ఆఫ్ఘన్ ఆర్మీ ప్రకటించింది.

అయితే, ఈ విష‌యంపై ఐఎస్ఐఎస్ మాత్రం ఒక్క ఉగ్రవాది కూడా చనిపోలేదని ప్రకటించింది. దీంతో అమెరికా చేసిన దాడి వృథా అయింద‌ని, అతి పెద్ద బాంబును వినియోగించిన‌ప్ప‌టికీ విఫ‌ల‌మైంద‌ని ప‌లు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. గతంలో ఈ బాంబు దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో ప్ర‌జ‌లు ఉండేవార‌ని, అయితే, ప్ర‌స్తుతం ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US  Massive Bomb Attack  Afghanistan  MOAB  

Other Articles