అమెరికా అతిపెద్ద బాంబు టెస్ట్ సక్సెస్.. టార్గెట్ కోసమే వెయిటింగ్ | Mother of All Bombs Was Just Waiting For the Right Target.

Mother of all bombs dropped in afghanistan

Mother of All Bombs, US Afghanistan, Donald Trump Mother of All Bombs, Mother of All Bombs Test, MOAB America, World Biggest Bomb, GBU-43/B Details, Biggest Bomb In World, North Korea Mother of All Bombs

US drops massive non-nuclear 'mother of all bombs' on Islamic State target in Afghanistan on ISIS Caves. Just Waiting For the Right Target. Donald Trump 'very proud' after dropping 'Mother of All Bombs' on Afghanistan

బాంబులకే బాబు.. సూపర్ సక్సెస్

Posted: 04/14/2017 07:20 AM IST
Mother of all bombs dropped in afghanistan

ఓవైపు తమకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుంటే అణుదాడి తప్పదని ఉత్తర కొరియా హెచ్చరిస్తున్న నేపథ్యంలో అమెరికా తన బలం ఏంటో నిరూపించుకుంది. అఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాద సంస్థ స్థావరాలు లక్ష్యంగా అతిపెద్ద బాంబు దాడి చేసింది. ఐఎస్ఐఎస్ ప్రాబల్యం అధికంగా ఉండే తూర్పు అఫ్గానిస్థాన్‌ లో పక్కా సమాచారంతో గురితప్పని భారీ బాంబును విడిచినట్లు అమెరికా భద్రతా విభాగం ప్రకటించింది.

సుమారు 9,525 కిలోల బరువు కలిగిన జీబీయూ-43 అనే భారీ బాంబును యంసీ-130 ఎయిర్‌ క్రాఫ్ట్‌ నుంచి వదిలినట్లు అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి జనరల్ జాన్ నికోల్సన్ వెల్లడించాడు. ఇంత భారీ బాంబుతో దాడి చేయడం ఇదే తొలిసారి అని ఆయన తెలిపాడు. అయితే పక్కా అణు రహిత బాంబు అని ఆయన స్పష్టం చేశారు. ఇంకోపక్క ఈ దాడిపై గర్విస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గత ఎనిమిది వారాలుగా అమెరికా సైన్యం అద్భుతాలు చేస్తోందని ఆయన చెప్పారు. ఏ మూల దాక్కున్నా ఉగ్రవాదులను అంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ దాడి నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. అఫ్గాన్‌ లోని నంగర్‌ హర్‌ జిల్లాలో ఐసిస్‌ ఉగ్రవాదుల భూగర్భ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడిని నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఇక ఐఎస్ఐఎస్ స్థావరాలు, సొరంగాలు, గుహలే లక్ష్యంగా అఫ్గానిస్థాన్‌ లో మరో భారీ దాడికి వ్యూహరచన చేసినట్లు చెబుతోంది. అయితే దాని డ్యామేజ్ ఎంత మేర ఉంటుందన్నది అసలు అంచనా వేయటమే కష్టంగా మారింది.

సిరియాతోపాటు ఇరాక్, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ మరియు ఉజ్బెకిస్థాన్ తదితర ప్రాంతాల్లో త్వరలో వీటిని ప్రయోగించే అవకాశం ఉన్నట్లు అనధికారికంగా చెబుతుండటం ఉత్తరకొరియాకు ఇండైరక్టుగా వార్నింగ్ ఇచ్చినట్లేనని స్పష్టమౌతోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  GBU-43/B  Mother of All Bombs  

Other Articles