చంద్రబాబు సర్కారుకు ముద్రగడ అల్టిమేటం.. mudragada gives ultimatum to TDP government

Mudragada slams chandrababu on kapu reservation

mudragada padmanabham, TDP government, chandra babu, election promises, kapu reservation stir, ultimatum, BC groups

Kapu community leader and former minister Mudragada Padmanabham slamed Tdp government for not keeping its election promise, the inclusion of the Kapu in the Backward Class category

టీడీపీ సర్కారుకు ముద్రగడ అల్టిమేటం..

Posted: 04/13/2017 04:49 PM IST
Mudragada slams chandrababu on kapu reservation

కాపు రిజర్వేషన్ల హామీల విషయంలో అంధ్రప్రదేశ్ అధికార ప్రభుత్వానికి వెన్నులో వణుకుపుట్టిస్తున్న వ్యక్తి కావు ఉద్యమ ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. మరోమారు చంద్రబాబు సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. వచ్చే నెల 7లోగా చంద్రబాబు కాపులకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కాపు కులస్థుల ఓట్లతో అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని మర్చి.. చంద్రబాబు సర్కార్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన ధ్వజమెత్తారు.

కాపు సంఘాలను బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని, కాపులను బీసీల జాబితాలో కలుపుతామని ఎన్నికల హామీలను ఇచ్చి. పార్టీ మానిఫెస్టోలో కూడా పెట్టిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే తమను విస్మరించడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైన చంద్రబాబు ప్రభుత్వం స్పందించి తమ కులస్థులను బీసీల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అదేరోజు కాపు జేఏసీతో సమావేశమై భవిష్యత్ కార్యచరణను నిర్ణయిస్తామని చెప్పారు. ప్రభుత్వం స్పందించి కాపు రిజర్వేషన్లపై చర్చలకు ఆహ్వానిస్తే తమ తరపున ఐదుగురిని పంపిస్తామన్నారు. వచ్చే 7 నుంచి కాపు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.

కాపులకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం కన్నా.. కాపు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికే చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నారని అంతకుముందు ఆయన ఆరోపించారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే కుట్రలకే ఆయన అధిక సమయాన్ని కేటాయిస్తున్నారని ఈ విషయంలో కాపు సోదరులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను చంద్రబాబు గ్రహించాలని హితవు పలికారు. ఓ సీనియర్‌ రచయిత చెప్పినట్టుగా ‘కాపులను గిల్లుతూ బీసీలను జోల పాడుతున్నారని, మరోసారి బీసీలను గిల్లుతూ కాపులను జోలపాడుతున్నారని ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles