ఉప ఎన్నికలలో సత్తాచాటిన బీజేపి.. కర్ణాటలో భంగపడిన కమలం.. BJP wins Delhi, HP, MP, Assam; Congress bags Karnataka seats

Bjp wins delhi hp mp assam congress bags karnataka seats

by poll result delhi, by poll result himachal pradesh, by poll result madhya pradesh, by poll result assam, by poll result karnaktaka, by poll result rajasthan, by poll results, BJP, Congress, AAP

The BJP won the Assembly bypolls in Delhi, Himachal Pradesh, Madhya Pradesh and Assam while Congress in Karnataka won both the seats.

ఉప ఎన్నికలలో సత్తాచాటిన బీజేపి.. కర్ణాటకలో భంగపడిన కమలం..

Posted: 04/13/2017 03:43 PM IST
Bjp wins delhi hp mp assam congress bags karnataka seats

కర్ణాటక ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ పట్టు చాటుకుంది. కర్ణాటకలోని ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండటంతో ఈ ఉప ఎన్నికను ఇటు అధికార కాంగ్రెస్‌, అటు ప్రతిపక్ష బీజేపీ సవాలుగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించినా బీజేపీ ఓడిపోవడం ఆ పార్టీ శ్రేణులకు షాక్‌ ఇచ్చింది. రెండుస్థానాల్లోనూ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది.

సిట్టింగ్‌ స్థానమైన నంజన్‌గూడ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎన్‌ కేశవన్‌మూర్తి 21వేల ఓట్ల  భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ తరఫున మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌ ప్రసాద్‌ బరిలోకి దిగినప్పటికీ గట్టిపోటీ ఇవ్వలేకపోయారు. మరో సిట్టింగ్‌ స్థానం​గుండ్లుపేటలోనూ కాంగ్రెస్‌ పార్టీ పదివేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి గీత మహదేవ ప్రసాద్‌ బీజేపీ అభ్యర్థి సీఎస్‌ నిరంజనకుమార్‌ను ఓడించారు.

దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 9న జరిగిన ఉప ఎన్నికలలో మరోమారు కమలం వికసించింది. ఏకంగా పదింట ఆరు స్థానాలను బీజేపి పార్టీ తమ ఖాతాలో వేసుకుంది. డిమానిటైజేషన్ ప్రభావాన్ని నగదు ఇబ్బందులను ఎత్తిచూపడంలో విపక్షాలు విఫలం కావడంతో పాటు బీజేపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కూడా ప్రజల కంటికి చూపలేకపోయారు. అయితే అంతకు ముందు బీజేపియేతర ప్రభుత్వాలు చేసిన ప్రజావ్యతిరేక విధానాలను ప్రచారం చేయడంతో బీజేపి సక్సెస్ సాధించింది.

దీంతో పది అసెంబ్లీ స్థానాలలో ఆరింటిని తమ ఖాతాలో వేసుకుని మరోమారు బీజేపీ సత్తా చాటింది. అయితే అన్నింటికన్నా ముఖ్యమైన ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ సీటును అప్ నుంచి బీజేపై రాబట్టుకుంది. దీంతో మొత్తంగా ఢిల్లీ అసెంబ్లీలో నాలుగు స్థానాలకు బీజేపి శాసనసభ్యుల సంఖ్య చేరుకుంది. అయితే ఈ పరాజయంపై అప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ. తమ అభ్యర్థి కారణంగానే తాము స్థానాన్ని కోల్పోయామని, అతను ప్రజలకు దూరమైన విషయాన్ని గ్రహించలేకపోయామని చెప్పారు.

కాగా, మధ్యప్రదేశ్‌ బాంధవ్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థి శివనారాయణ్‌సింగ్‌ విజయం సాధించింది. అటు అసోం ధేమలీ ఉప ఎన్నికలోనూ కమలం పార్టీ పట్టుసాదించింది. రాజస్థాన్ ధోల్‌పూర్‌లోనూ బీజేపి విజయం సాధించింది. హిమాచల్‌ ప్రదేశ్‌ భోరాంజ్‌లోనూ కమలం పార్టీని గెలుపు వరించింది. ఇక పశ్చిమబెంగాల్‌ కాంతి దక్షిణ్‌ స్థానంలో టీఎంసీ అభ్యర్థి చంద్రిమా భట్టాచార్య ఘన విజయం సాధించి అధికార తృణముల్ పార్టీ సత్తా చాటారు. జార్ఖండ్‌ లితిపరాలో జార్ఖండ్‌ ముక్తి మోర్చా అభ్యర్థిని గెలుపు వరించింది. ఇక కర్ణాటకలోనూ అధికార కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : by poll results  congress  bjp  karnataka  delhi  assam  madya pradesh  himachal pradesh  rajasthan  politics  

Other Articles