పబ్లిక్ గా యువతి కాళ్లు మొక్కిన ప్రేమికుడు.. youth apologizes his girl friend by touching her feet

Bengaluru youth apologizes his girl friend by touching her feet

youth apologizes his girl friend by touching her feet, bengaluru youth, girlfriend, apology, busstop, public, conistable, youth touches girlfriends feet, cctv footage, viral video

bengaluru youth apologizes to his girl friend by touching her feet at a bus stop in public, what happens when she agrees to go with him..

ITEMVIDEOS: పబ్లిక్ గా యువతి కాళ్లు మొక్కిన ప్రేమికుడు.. అంతలో ఏం జరిగింది..?

Posted: 04/13/2017 05:44 PM IST
Bengaluru youth apologizes his girl friend by touching her feet

సోషల్ మీడియాలో ఓ సిసిటీవీ వీడియో ఫూటేజ్ తెగ వైరల్ గా మారింది. అమె తన ప్రేయసో.. లేక తన భార్యో తెలియదు కానీ మొత్తానికి ఆ యువకుడ్ని తన కాళ్ల బేరానికి తెచ్చుకుంది. ఏదో సినిమాల్లో ఇలాంటి సీన్లు చేసే నెట్ జనులు.. ఒక్కసారిగా నిజజీవితంలోనూ ఇలాంటి సీన్ చూసేసరికి ఔరా ఇలా కూడా మగాళ్లు చేస్తారా.. ఇప్పుడు కదా ఎంతవారలైనా కాంతదాసులే అన్న నానుడి నిజమైంది.. అంటూ తెగ షేర్లు చేసుకుంటున్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

అమెకు అతనిపై కోపం వచ్చింది. అతనితో ఇక వద్దనుకుని వెళ్లిపోతుంది. అంతలో అమె వెనకగా బైక్ పై వచ్చిన ప్రేమికుడు అమెను తన బైక్ ఎక్కమన్నాడు. అందుకు అమె నిరాకరిచిన వెనక్కు జరిగింది. వెనక్కనున్న బస్టాండులోకి వెళ్లింది. తన బైకెక్కమంటూ ఆవిడని వేడుకున్నాడు. ఎంత చెప్పినా తను ఒప్పుకోడం లేదు. కాసేపు ఏమీ మాట్లాడకుండా ఇద్దరూ అలా సైలెంట్‌గా నిల్చున్నారు. అమె రాను అంటూ మొరాయించడంతో అమె చేయి పట్టుకొని లాక్కెల్లే ప్రయత్నం చేశాడు. అంతలో అక్కుడున్న ఓ పెద్దాయని మధ్యలోకి జోక్యం చేసకుని అమె చేతిని వదిలమని చెప్పడంతో విడిచిపెట్టాడు.
 
కాని తన ప్రయత్నం మాత్రం మానుకోని యువకుడు ఇక చేసేది లేక ఒక్కసారిగా అమె కాళ్లపై పడ్డారు., ఒకటి కాదు రెండు సార్లు. దీంతో అప్పటి వరకు అతడి నుంచి పారిపోవాలని ప్రయత్నించిన యువతి ఆ చర్యతో చలించి పోయి సరే పద అన్నడంతో యువకుడు బైక్ తీయడానికి సన్నధమయ్యాడు. కానీ అంతలో అక్కడ ఓ విచిత్రం జరిగింది. యువకుడికి వద్దకు ఓ పోలీస్ కానిస్టేబుల్ వచ్చి బైక్ తాళం వేశాడు. అంతే అది చూడగానే యువకుడు పరుగు లంఖించుకున్నాడు. అ యువతి చేసేది లేక అక్కడే వుండిపోయింది. అసలెందుకు ఆ యువకుడి పారిపోయాడన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కానీ ఈ వీడియో మాత్రం నెట్ లో ట్రెండ్ అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles