విమానంలోంచి మనుషల్ని తోసేశారు.. Body thrown out of plane lands on hospital roof

Three bodies tossed from plane one found on roof of hospital

Body thrown out of plane, body lands on hospital roof, mexico, Eldorado, Sinaloa state, Culiacan, Joaquin El Chapo Guzman, drug lord, El Chapo's Sinaloa state, Sinaloa drug cartel, rival gangs

In a bizarre incident, residents of a Mexican town witnessed a man's body being thrown out of a plane, which was later found to have landed on the roof of a hospital.

విమానంలోంచి మనుషల్ని తోసేశారు..

Posted: 04/13/2017 01:14 PM IST
Three bodies tossed from plane one found on roof of hospital

మనుషుల్లో నేర ప్రవృత్తి బాగా పెరగిపోతుంది. మనిషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఎక్కడో కరుడుగట్టిన ఉగ్రవాదులు అత్యంత ఘోరకళికి అజ్యం పోస్తున్నారని, కనివిని ఎరుగని దారుణంగా శిక్షలతో మనుషుల ప్రాణాలను బలితీసుకుంటున్నారని వింటుంటేనే మనలో భాయందోళన కలుగుతుంది. అయితే అంతకంటే దారుణంగా ఊహకందని విధంగా మెక్సికోలో నేరగాళ్లు తమ ప్రత్యర్థులను మట్టుబెడుతున్నారు.

విమానం గాల్లో వెళ్తుండగా, అందులోంచి ఓ వ్యక్తిని కిందకు పడేసి తమ కసి తీర్చుకున్నారు ప్రత్యర్థులు. అయితే ఈ ఘటనతో అలెర్ట్ అయిన స్థానికులు అదే విమానాన్ని పరిశీలించి చూడగా మరో ఇద్దరు వ్యక్తులను కూడా అదే విధంగా విమానం నుంచి కింద పడేశారని స్థానికులు చెబుతున్నారు. విమానం నుంచి ప్రత్యర్థి గ్యాంగులకు చెందిన వ్యక్తలను ఇలా పడేయటం మెక్సికోలో పెను కలకకలం రేపుతోంది. మెక్సికోలోని డ్రగ్స్‌ అక్రమ రవాణా ముఠాలు అఘాయిత్యాలకు పాల్పడటం కొత్తకాదు. అయితే ఈ తరహా నేరాలు మాత్రం ఇప్పటి వరకు జరగలేదు.

ప్రత్యర్థి ముఠా సభ్యులపై అధిపత్యం చెలాయించడం కోసం అక్కడ నేరాలు జరుగుతూనే వుంటాయి. అయితే ఈ నేరాలన్నింటినీ ప్రజలు చూసి భయాంధోలన చెందే విధంగానే వుంటాయి. కానీ తొలిసారిగా ఇలాంటి నేరం నమోదైంది. మెక్సికోలో డ్రగ్స్ ముఠాలు జడలు విప్పే నాట్యమాడే ప్రాంతమైన సినోలా రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో నుంచి ఒక వ్యక్తిని బిల్డింగ్‌పై పడేశారు. ఎల్డొరాడో నగరంలోని ఐఎమ్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి మీద ఆ వ్యక్తి శరీరం పడిందని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన హెల్త్‌ అధికారి ఒకరు తెలిపారు.

ఆసుపత్రి రూఫ్‌ నుంచి వ్యక్తి శరీరాన్ని లోపలికి తీసుకొచ్చి చికిత్స అందించే ప్రయత్నం చేసినా వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. అప్పటికే ఆ వ్యక్తి మరణించాడన్నారు. అయితే, వ్యక్తిని చంపి కిందకు పడేశారా? లేదా ప్రాణాలతోనే కిందకు పడేశారా? అనే విషయంలో వైద్యలు ఎలాంటి నిర్ధారణకు రాలేకపోతున్నారు. కాగా, సినోలా రాష్ట్రంలో డ్రగ్స్‌ అక్రమ రవాణా ముఠాలు ఒకరిపై ఒకరు ప్రతీకార దాడులు చేలరేగిపోవడం కొత్తంకాదన్న వార్తలు వినబడుతున్నాయి. 2016లో సినోలా డ్రగ్స్‌ అక్రమ రవాణా డాన్‌ చాపో గుజ్మెన్ ను పోలీసులు అరెస్టు చేసిన నాటి నుంచి ప్రతీకార దాడులకు ఎక్కువయ్యాని స్థానికులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drug lord  drug traffickers  rival gangs  Sinaloa  Culiacan  eldorado  mexico  

Other Articles