మిసెస్ ట్రంప్ ఓ వ్యభిచారిణి! ఎంత డబ్బులు ఇచ్చారంటే... | Melania Trump Wins an Apology from the Daily Mail.

Melania trump wins daily mail lawsuit

Melania Trump, Melania Trump Escort, Escort Lawsuit, Donald Trump Wife, America First Lady Law Suit, Daily Mail and MailOnline Melania Trump, Melania Trump Law Suit, First Lady Escort, First Lady Wins, Melania Trump Win Suit, Melania Trump Case, Melania Trump New York Court

Melania Trump Escort lawsuit. Daily Mail and MailOnline agree to pay damages to First Lady.

ట్రంప్ భార్య కూడా గెలిచేసిందిగా...

Posted: 04/13/2017 08:01 AM IST
Melania trump wins daily mail lawsuit

ట్రంపే కాదు, ఆయన భార్య, మెలానియా కూడా వార్తలకు కొత్తేం కాదు. మోడల్ అయిన ఆమె మ్యాగ్జైన్ కవర్ పేజీలపై నగ్నంగా దర్శనమిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక మాత్రం ఏకంగా ఆమెను వ్యభిచారిణి(ఎస్కార్ట్) అని కామెంట్ చేసి చిక్కుల్లో పడటమే కాదు, కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. చివరకు ఆ పోరులో మెలానియానే విజయం సాధించి, భారీ సొమ్మును పరువు నష్టం కింద వసూలు చేసింది.

ప్రముఖ బ్రిటన్ పత్రిక ‘డెయిలీ మెయిల్’ గతేడాది అమెరికా ఎన్నికల సందర్భంగా ఓ ఆర్టికల్ ప్రచురించింది. మెలానియా గతంలో వ్యభిచార వృత్తిలో ఉండేవారని, ఆమె పని చేసిన ఓ ఏజెన్సీ కంపెనీ నిర్వాహకుడే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడని పేర్కొంటూ ఓ ఆర్టికల్ ప్రచురించింది. ఈ కథనంపై మెలానియా మేరీల్యాండ్ కోర్టులో పరువునష్టం దావా వేసింది. అయితే అది తమ పరిధిలోకి రాదని మేరీల్యాండ్ చెబుతూ కోర్టు పిటిషన్ ను కొట్టేసింది. దీంతో ఫిబ్రవరిలో న్యూయార్క్ లో ఆమె మరో పిటిషన్ దాఖలు చేసింది. తన పరువుకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించారని ఆమె తరపు న్యాయవాది వాదించాడు. కోర్టు కూడా వాటితో ఏకీభవించింది. దీంతో డెయిలీ మెయిల్ తోపాటు మెయిల్ వన్ యాజమాన్యాలు మెలానియాతో రాజీకి వచ్చింది.

ఈ విషయాన్ని పత్రికతోపాటు మెలానియా అడ్వొకేట్ కూడా ఓ ప్రకటనలో తెలిపారు. మెలానియాకు క్షమాపణలు చెప్పడంతోపాటు ఆమెకు 2.9 మిలియన్ డాలర్లు (రూ.19 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించినట్టు తెలిసింది. కాగా, మెలానియా 150 మిలియన్ డాలర్లు (రూ.1000 కోట్లు) డిమాండ్ చేశారు. మెయిల్ ఆన్‌లైన్‌తోపాటు మరో నాలుగు వార్తా సంస్థలకు కూడా మెలానియా నోటీసులు పంపగా, వారిని మాత్రం క్షమాపణలు చెబితే చాలని తెలిపింది. కాగా, పిటిషన్ దాఖలు చేసిన సమయానికి ఆమె అమెరికా అధ్యక్షుడి భార్యగా దేశ ప్రథమ మహిళ హోదాలో ఉన్నప్పటికీ, ఆ కథనం సెప్టెంబర్ లో రావటంతో ఓ మాములు బిజినెస్ మెన్(ట్రంప్) భార్యగానే ఆమె తన పేరును అందులో పేర్కొనటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Melania Trump  Escort Law Suit  New York Court  

Other Articles