ఇకపై గోవా తీరంలో అవి వెతికాన కనిపించవు.. Goa Minister demands ban on late night rave parties

Goa minister demands ban on late night rave parties

parrikar government, goa, panaji, , goa night club, goa discotheque, water resources department minister vinod palyekar, goa night club party, goa rave party

Goa Water Resources Minister Vinod Palyekar has demanded a complete ban on drug-ridden rave parties on beaches in the coastal state.

ఇకపై గోవా తీరంలో అవి వెతికాన కనిపించవు..

Posted: 04/12/2017 09:09 PM IST
Goa minister demands ban on late night rave parties

గోవాలోని మనోహర్ పారికర్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బీచ్‌లకు, బీచ్‌ పార్టీలకు, లేట్ నైట్ పార్టీలకు మారు పేరుగా నిలిచిన గోవాలో త్వరలో అన్ని రకాల మిడ్‌ నైట్‌ పార్టీలను, రేవ్‌ పార్టీలను పూర్తిగా నిషేధించేందుకు ప్రభుత్వం సన్నధమవుతుంది. ఇప్పటికే ఈ తరహా పార్టీలకు 80శాతం చెక్ చెప్పిన ప్రభుత్వం పూర్తిగా నిషేధించే వైపు కదులుతోంది. రానున్న నెల రోజుల వ్యవధిలో లేట్‌ నైట్‌ పార్టీలు, రేవ్‌ పార్టీలపై పూర్తిగా నిషేధం విధించించేందుకు గోవా ప్రభుత్వం రెడీ అయ్యింది.
 
ఈ మేరకు గోవా జలవనరుల శాఖ మంత్రి వినోద్‌ పాలేకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. మన సంస్కృతిలో భాగం కాని లేట్ నైట్ పార్టీలను, రేవ్ పార్టీలను ఎందుకు ప్రోత్సహించాలి..? అని ఎదురు ప్రశ్నించారు. పర్యాటక కేంద్రమైనంత మాత్రాన విదేశీ సంస్కృతిని ఇక్కడ పాటించాల్సిన అవసరం లేదని, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదని.. అందుకే వెంటనే మూసివేసేదిశగా ప్రభుత్వం యోచిస్తుందని చెప్ాపరు. గోవా తీరంలో డ్రగ్స్‌ విక్రయాలు, అక్రమ రవాణా నియంత్రించలేని స్థాయికి చేరిందనీ, అందుకే  తక్షణం ఈ పార్టీలను నిలిపివేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.  

తొలి చర్యగా అర్థరాత్రి, రేవ్‌ పార్టీలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఈ మేరకు పోలీసు అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేశామని చెప్పారు. అనేక హెచ్చరికలు, రిమైండర్లు పంపినప్పటికీ, తెల్లవారు జామున 3-4 గంటలవరకు పార్టీలు కొనసాగుతున్నాయని, దీని మూలంగా పెద్దవాళ్లే కాకుండా, బోర్డు పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు కూడా ఇబ్బందులను ఎదుర్కోంటున్నారని అన్నారు. వీటిపై పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని దీంతో వాటిపై నియంత్రణ చేపడుతున్నామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Goa  Government  late night parties  ban on rave parties  drugs  smuggling  Vinod Palyekar  

Other Articles