కేసీఆర్ సాబ్ హ్యాండిల్ విత్ కేర్ | Telangana reservations strongly objected BJP.

Kcr strategy on muslim quota increase

KCR, Telangana Reservations, KCR Muslims Reservations, Telangana Reservations 60, BJP Muslim Reservations Increase, Muslim Quota Increase Telangana, KCR Conveyed, Muslim and ST Reservations, KCR Reservations

Telangana to hike Muslim, ST quotas despite strong objection from BJP. Assembly to be convened soon. 60% reservations soon in Telangana.

కేసీఆర్ సాబ్.. హ్యాండిల్ విత్ కేర్

Posted: 04/12/2017 10:50 AM IST
Kcr strategy on muslim quota increase

అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచటమే ధ్యేయమని ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన టీఆర్ఎస్ బాస్ కే. చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక వాటి అమలు కోసం గట్టిగానే యత్నాలు మొదలుపెట్టాడు. ప్రత్యేక భవన సముదాలను కల్పించటం, పండగలకు భారీగా నిధులు వెచ్చించటం లాంటి వాటితో సరిపెట్టకుండా బోనస్ గా రిజర్వేషన్ల పరంగా కోటా పెంచే ఆలోచనను అమలు చేస్తున్నాడు.

ఇందులో భాగంగా ముస్లింలకు, ఎస్టీలకు 12 శాతం దాకా రిజర్వేషన్లను పెంచే దిశగా అడుగులు వేయబోతున్నాడు. బీఎస్ రాములు నేతృత్వంలోని బీసీ కమిషన్ ఇప్పటికే అందుకు అవసరమైన రికమండేషన్లతో నివేదికను సమర్పించగా, ముందు కేబినెట్ మీటింగ్ లో చర్చించి, ఆపై గవర్నర్ ను కలిసి ఆ ప్రతిపాదనను వివరించాడు. ఇక మిగిలింది అసెంబ్లీ లో దానిని బిల్లుగా ఆమోదింపజేయటమే. కానీ, అందుకు కొన్ని అడ్డంకులు ఇక్కడ ఉన్నాయి.

ముస్లింలకు ప్రస్తుతం 4 శాతం కోటా ఉండగా, ఎస్టీలకు 6 శాతంగా ఉంది. సుప్రీంకోర్టు మార్గ దర్శకాల ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా రిజర్వేషన్ల కోటా 50 శాతానికి మించి ఉండకూడదు. ముస్లింలకు ఏడు నుంచి 9, ఎస్టీలకు 6 నుంచి 9 దాకా ఉండొచ్చు. అయితే కేసీఆర్ మాత్రం ముస్లింలకు 12 శాతం చేయాలన్న ఆలోచనతో కోటా 69 శాతంకి చేరుతుంది. దీంతో ఆటోమేటిక్ గా న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉంటుంది.

నిజానికి మార్చి 27న ఓ ప్రకటనలో వారం రోజుల్లో బిల్లు కార్యరూపం దాలుస్తుందని స్వయంగా కేసీఆరే చెప్పినప్పటికీ అది జరగలేదు. భవిష్యత్తులో నివారించేందుకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో మార్పులు చేయాల్సిందిగా కేంద్రానికి విజ్నప్తి చేయటం, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతోనే ఆలస్యం జరిగినట్లు అర్థమౌతోంది. మరోపక్క ఎంఐఎం కూడా రిజర్వేషన్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గొద్దంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. అయితే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలత చూపుతుందనుకోవటం అత్యాశే అవుతుంది.

పైగా మతపరమైన బిల్లులను వ్యతిరేకిస్తూ బడ్జెట్ సమావేశాల్లో పెద్ద గందరగోళమే జరిగింది కూడా. అయినప్పటికీ ముందు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి, ఆపై కేంద్రంపై గొడవ పడకుండా కేవలం ఒత్తిడి ద్వారా సాధించుకోవాలన్నదే తెలంగాణ ప్రభుత్వ అభిమతంగా కనిపిస్తోంది. ఏ అంశంలో అయినా వెనకడుగు వేయని గులాబీ బాస్ ఎవరినీ నొప్పించకుండా దీనిని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Muslim Reservations  KCR  

Other Articles