ఉగ్రవాదుల టార్గెట్ గా చర్చిలే ఎందుకు? | Why ISIS target Egyptians Coptic churches.

Fatal blasts near egypt church kills 43

Egypt, Egypt Blasts, Egypt Terror Attack, Egypt Church Bombings, Church Bombings ISIS, Egypt ISIS, Coptic Egypt, Church Blasts

Fatal blast near Egypt church. 43 Killed in Palm Sunday Bombings at Coptic Churches. ISIS Claims Responsibility for Egypt Church Bombings. Later emergency declared.

ఎమర్జెన్సీ: చర్చిలో బ్లాస్ట్... 43 మంది మృతి

Posted: 04/10/2017 07:13 AM IST
Fatal blasts near egypt church kills 43

ఐసిస్ మరోసారి మారణహోమం సృష్టించింది. క్రిస్టియన్లే టార్గెట్ గా ఈజిప్టులో రెచ్చిపోయి చర్చిలలో జంట బాంబు పేలుళ్లు జరిపింది. దీంతో 43 మంది మృత్యువాత పడగా, దేశంలో మూడు నెలలపాటు ఎమర్జెన్జీ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.

టాంటాలోని సెయింట్ జార్జ్ కాప్టిక్ చర్చి వద్ద గుడ్ ఫ్రైడే కావటంతో జనం పెద్ద ఎత్తున్న హాజరయ్యారు. ఇంతలో ఒక్కసారిగా అక్కడున్న మానవ బాంబు తనని తాను పేల్చేసుకుంది. 16 మంది మృతి అక్కడిక్కడే తునాతునకలైపోయారు. ఉత్తర కైరో లో జరిగిన మరో పేలుడులో మరో 27 మంది అక్కడిక్కడే మృతి చెందారు. చర్చి బయట ఉన్న సీసీ పుటేజీల్లో జరిగిన పేలుడు రికార్డయ్యింది. ఇంకా 42 మందికి ఈ ఘటనలో తీవ్ర‌గాయాల‌య్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న బ‌ల‌గాలు గాయాల‌పాల‌యిన వారిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించాయి. దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫటాహ్ దాడుల పై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అత్యవసర పరిస్థితి ప్రకటన చేశాడు.

అక్క‌డి కాప్టిక్ క్రిస్టియన్లే లక్ష్యంగా ఈ దాడులు జ‌రుగుతున్నాయి. గ‌తేడాది డిసెంబరులో క్రిస్మస్ సమయంలో కూడా జరిగిన ఉగ్ర‌దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. కాగా, ఘటనలకు తామే బాధ్యులమని, వారి రక్తంతో నదులు పారాల్సిందేనని ఐఎస్ఐఎస్ ప్రకటన వెలువరించింది. ఇస్లాం రాజ్యమయిన ఈజిప్ట్ వారితో నిండిపోవటం ఇక జరగబోదంటూ మరిన్ని దాడుల హెచ్చరికలను జారీ చేసింది. మరోవైపు అమెరికా సహా ప్రప్రంచ దేశాలన్నీ ఈ ఘోరాన్ని ఖండిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Egypt  Church Bombings  43 Killed  

Other Articles