ఇక యూపీలోనూ అన్నపూర్ణ క్యాంటీన్లు.. Yogi Adityanath plans three meals a day for Rs 13

Yogi adityanath plans three meals a day for rs 13 per day across up

Yogi govt, Mission 2019, Breakfast, Lunch, Swami Prasad Maurya, Suresh Khanna, Cow sheds, Uttar Pradesh government, subsidised breakfast, subsidised lunch, Annapurna hotels

The Yogi Adityanath government will soon launch ‘Annapurna canteens’ that will provide subsidised food to students, those working in the low income group in private sectors, workers and attendants of patients.

ఇక యూపీలోనూ అన్నపూర్ణ క్యాంటీన్లు.. రూ 13కే రోజువారీ బోజనం..

Posted: 04/10/2017 07:05 AM IST
Yogi adityanath plans three meals a day for rs 13 per day across up

దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఓ పథకం హిట్ అయితే చాలు.. అదే పథకాన్ని వేర్వేరు రాష్ట్రాల్లో పేర్లు మార్చి అమలు పరుస్తుంటారు రాజకీయ నేతలు. తెలుగు రాష్ట్రాల్లో రుణాలు మాఫీ చేస్తామన్న ఎన్నికల హామీని అప్పట్లో బీజేపి పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అయతే ఆ హామీ ఇచ్చి ఎన్నకలలో విజయాలను సాధించిన పార్టీలను చూసి తాము వ్యతిరేకం అంటూనే ఎట్టకేలకు ఉత్తర్ ప్రదేశ్ లో రైతుల రుణమాఫీలు చేసేందుకు బీజేపి పార్టీ అంగీకరించి దానిని ఎన్నికల హామీగా ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఆంద్రుల అన్నగారు స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు నగరాలు, పట్టణాల్లోని పేదలు కడుపునిండా పట్టెడన్నం తినాలని, రాష్ట్రంలో అకలి చావులు వుండకూడదన్న ఉద్దేశ్యంతో అన్నపూర్ణ హోటళ్లను స్థాపించి పేదల కడుపులు నింపారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు దానిని కొనసాగించకపోవడంతో అవి కాస్తా కనుమరుగయ్యాయి. అదే స్కీమ్ ను తమిళనాడులో విజయవంతంగా అమలు చేశారు దివంగత ముఖ్యమంత్రి జయలలిత. అమ్మా క్యాంటిన్ల పేరుతో అమె ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడు తెలుగురాష్ట్రాలు కూడా అములు చేస్తున్నాయి. ఇదే తరహా పథకాన్ని ప్రవేశపెట్టాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కూడా తాజాగా నిర్ణయించింది.

అన్నపూర్ణ భోజనాలయ పేరుతో పేదలకు తక్కువ ధరకు బ్రేక్‌ ఫాస్ట్‌, రెండు పూటలా భోజనం అందించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత‍్యనాథ్‌ భావిస్తున్నారు. 3 రూపాయలకు బ్రేక్‌ ఫాస్ట్‌, 5 రూపాయలకు భోజనం అందించాలని యోచిస్తున్నారు. ఈ పథకానికి తుది మెరుగులు దిద్దే బాధ్యతను యూపీ మంత్రులు స్వామి ప్రసాద్‌ మౌర‍్య, సురేష్‌ ఖన్నాలకు అప్పగించారు. యూపీ రాజధాని లక్నోతో పాటు కాన్పూర్, ఘజియాబాద్, గోరఖ్‌పూర్లలో సబ్సిడీ క్యాంటీలను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 200 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles